చేసిన తప్పే మళ్ళీ చేస్తున్న మహేష్ .. అంత రిస్క్ అవసరమా?

సినిమా అనే కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, ఒక బిజినెస్.దీన్ని బిజినెస్ లా చూస్తేనే లాభపడతారు.

 Mahesh Babu Again Takes A Stupid Decision For Record ?-TeluguStop.com

హీరోల మీద అభిమానం ఈ బిజినెస్ లో పనికిరాదు.రికార్డుల కంటే లాభాలు ముఖ్యం.

ఈ విషయాన్ని ఇటు మన స్టార్స్ తో పాటు పంపిణిదారులు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది

GST అనేది ఒకటి అమలులోకి వచ్చింది అని తెలీక కాదు, తెలిసి కూడా GST ప్రభావం రేట్లకి అప్లై చేయడం లేదు‌.షేర్లు తగ్గుతున్నాయి.

GST లేకపోయింటే, 60 కోట్లతో బిజినెస్ ముగించేలా కనిపిస్తున్న స్పైడర్ 70 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టేదేమో.GST భారం డిస్ట్రీబ్యూటర్స్ కి అర్థం అవుతున్నా, పెద్ద హీరో సినిమా అనగానే మళ్ళీ అదే తొందరపాటు వ్యవహారం

స్పైడర్ కేవలం ఆంధ్ర ప్రాంతంలో (నైజాం, సీడెడ్) కలపకుండా 34-35 కోట్లకు అమ్ముడుపోయింది‌.

రికార్డు అని ఫ్యాన్స్ మురిసిపోయి ఏం లాభం? ఇప్పుడు నష్టాలు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయి.పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా ఏకంగా ఆంధ్ర మొత్తంలో 43-45 కోట్లకు అమ్ముడుపోయేలా ఉంది.

తాజా కబురు ఏమిటంటే, భరత్ అనే నేను కూడా 45 కోట్లకు అమ్ముడుపోయేలా ఉంది.నైజాం, సీడేడ్ నుంచి మరో 35 కోట్లు అయినా వస్తాయి.అంటే కేవలం తెలుగు రాష్ట్రాల బిజినెస్ 80 కోట్లకు చేరుకుంటుంది.ఓవర్సీస్ డీల్ 18 కోట్లకు పైగానే జరుగుతోంది.

కర్ణాటక 10 కోట్లకు పైగానే ఉంటుంది.ఇక మిగితా రాష్ట్రల చిల్లర కలుపుకుంటే కేవలం థియేట్రికల్ బిజినెస్ లెక్కలే 110-120 రేంజ్ లో ఉంటాయి.

శాటిలైట్ కలుపుకుంటే మళ్ళీ స్పైడర్ మాదిరి లెక్క 150 కోట్లు దాటుతుంది

పంపిణిదారులపై ఇంత భారం ఎందుకు? ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా, మహేష్ ఎందుకు తన సినిమాని తక్కువ రేట్లకి అమ్మేలా చూడటం లేదు.భరత్ అనే నేను స్పైడర్ మాదిరి 120 కోట్ల బడ్జెట్ సినిమా కాదు కదా.ఈ సినిమాకి అయినా రికార్డుల పట్టింపులకి వెళ్ళకపోతే, సినిమా హిట్ అయితే పంపిణిదారులకి లాభలొస్తాయి కదా.GST తరువాత కూడా ఇటు స్టార్ హీరోల్లో మార్పు రాకపోతే, అటు డిస్ట్రీబ్యూటర్స్ లో మొండితనం లేకపోతే, రానున్న రోజుల్లొ చాలా గడ్డుకాలం చూడాల్సివస్తుంది.అందుకు ఉదాహరణ జైలవకుశ.టాక్ బాగున్నా, లాభాల్లో పడేలా లేరు పంపిణిదారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube