మహేష్ - రామ్ చరణ్ కలిసి బిజినెస్‌ చేయబోతున్నారా?

సూపర్ స్టార్ మహేష్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.వీరిద్దరు మాత్రమే కాదు, వీరి సతీమణులు నమ్రత, ఉపాసన కూడా మంచి స్నేహితులు.

 Mahesh And Ram Charan To Turn Business Partners-TeluguStop.com

అందుకే మహేష్ – చరణ్ కలిసి పార్టీలు చేసుకుంటారు, కలిసి విదేశాలకు షికారుకి కూడా వెళ్తారు.

మొన్న నమ్రత పుట్టినరోజు.

ఆ సెలెబ్రెషన్లో కూడా చరణ్ ఉపాసన కనిపించారు.దీన్నిబట్టి మీరే అర్థం చేసుకోండి ఈ ఇద్దరు టాప్ హీరోల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో, ఎంత ఫ్రెండ్ షిప్ ఉందో.

ఇప్పుడు మహేష్ – రామ్ చరణ్ కేవలం స్నేహితులలానే ఉండకుండా, బిజినెస్ పార్టనర్స్ అవబోతున్నారని తెలుస్తోంది.

వీరిద్దరు కలిసి ఓ పెద్ద హోటల్ చైన్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారని, ఇండియా మొత్తంలో పెద్దగా ప్లాన్ చేసారని, ఇందులో ఎక్కువ పెట్టుబడి చరణ్ ది ఉంటే, మహేష్ పార్టనర్ గా ఉంటాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరి ఇందులో నిజానిజాలు ఏంటో, ఈ ఇద్దరిలో ఒకరు చెబితే తప్ప తెలియవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube