మహేష్ - ఎన్టీఆర్ తప్పేమి లేదు

మహేష్ బాబుని ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ ని చేసిన సినిమా పోకిరి.ఆ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన విషయం తెలిసిందే అప్పట్లో పెను ప్రకంపనలు రేపింది ఈ ఆల్ టైమ్ హిట్.

 Mahesh And Ntr Rightly Ignoring Puri Jagannath-TeluguStop.com

దాని తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మెన్ కూడా మంవి వసూళ్ళను రాబట్టింది.ఆ సినిమా తరువాత మళ్ళీ పెద్దగా జనాదరణ పొందే సినిమాలను రూపొందించలేదు పూరి.

వక్కంతం రాసిన కథ నచ్చి ఎన్టీఆర్ అవకాశమిస్తే టెంపర్ లాంటి సక్సెస్ దొరికింది కాని, అంతా ఆ క్రెడిట్ వక్కంతం కథకే ఇచ్చారు.ఆ సినిమా తరువాత వచ్చిన జ్యోతిలక్ష్మీ, లోఫర్, తాజాగా ఇజం .అన్ని డిజాస్టర్లే.పూరి సినిమాల్లో పదును తగ్గింది అని అంతా విమర్శిస్తున్నారు.

మరి ఇలాంటి సమయంలో అవకాశమివ్వట్లేదని మహేష్, – ఎన్టీఆర్ ని నిందిస్తే ఎలా?

రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరికోసం ఎదురుచూడను అని మహేష్ పై డైలాగులు వదులుతున్న పూరి, ఈమధ్య ఆయన తీసిన సినిమా రిజల్ట్ కూడా చూసుకుంటే మంచిదేమో.ఇప్పుడు మహేష్, రేపు ఎన్టీఆర్ .ఇద్దరు ఇప్పుడప్పుడే అవకాశమివ్వకపోయినా, వారిని అనడానికి ఏమి లేదు.సక్సెస్ ట్రాక్ పై లేని దర్శకుడితో రిస్క్ చేయాలని ఏ అగ్రహీరో మాత్రం అనుకుంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube