మహేష్ - ఎన్టీఆర్ రాజకీయాలు .. ఫలితాలు ఎలా ఉంటాయో

ప్రస్తుతం టాలివుడ్ లో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.అదే రాజకీయాల ట్రెండ్.

 Mahesh And Ntr .. Both Into Politics-TeluguStop.com

ఒకరి తరువాత ఒకరు, అంతా రాజకీయాల మీద పడుతున్నారు.రాజకీయ నాయకుడిగా తెర మీద కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రానా దగ్గుబాటి నేనే రాజు నేనే మంత్రిలో లాల్చీ పొలిటీషియన్ గా కనిపించబోతోంటే, ఇప్పుడు ఇద్దరు అగ్రహీరోలు కూడా తెరపై రాజకీయాలే చేయనున్నారు.ఆ ఇద్దరే మహేష్ బాబు, ఎన్టీఆర్.

మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా భరత్ అనే నేను.ఇది ఒక లార్జర్ దన్ లైఫ్ కథ అని, మహేష్ బాబు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని టాక్.

కేవలం టాక్ మాత్రమే కాదు, మహేష్ ఇందులో ముఖ్యమంత్రి గానే కనిపించనున్నాడు.అయితే ఇది పొలిటికల్ సినిమా అయినా, నిజజీవితంలోని రాజకీయాలపై, రాజకీయ పార్టీలపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు ఉండవని, ఓ ముఖ్యమంత్రి జీవితంలోని భావోద్వేగాలే ఈ సినిమా అని తెలుస్తోంది.

మహేష్ ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు.మహేష్ పెద్ద పెద్ద స్పీచులు ఇస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ కూడా జై లవ కుశలో మూడు పాత్రలు చేస్తుండగా, అందులో జై పాత్ర రాజకీయ నాయకుడి పాత్ర అని, సమ సమాజ్ అనే పార్టీకి జై నాయకుడని తెలుస్తోంది.ఎన్టీఆర్ కి స్టేజి, వేలమంది జనం, వారి ముందు మాట్లాడటం, ఇవేమి కొత్త కాదు.

ఎన్టీఆర్‌ టీడిపిలో యాక్టివ్ గా ఉన్నప్పుడు తన ప్రసంగతో విపరీతంగా ఆకట్టుకున్నాడు.ఇప్పుడు తెర మీద అదే వాడి వేడి చూపించబోతున్నాడు.

మరి ఈ సరికొత్త పాత్రల్లో మన టాప్ హీరోలని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇద్దరిలో ఎవరి పాత్రకి ఎక్కువ స్పందన లభిస్తుందో, ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube