ఒక పెద్ద సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది ? 40-50 కోట్లు.ఇదే బడ్జెట్ మారుతి లాంటి దర్శకుడికి ఇస్తే, ఏకంగా 5 సినిమాలు చేసి పెడతాడు తక్కువలో తక్కువ.
మరి అన్నేసి కోట్లు కేవలం హీరో దర్శకుడికే వెళితే.మహేష్ – మురగదాస్ సినిమాకు ఇదే జరగబోతోంది.80-100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి మహేష్ – మురుగదాస్ కలిసి తీసుకుంటున్న పారితోషికమే 43 కోట్ల దాక ఉంటుందట.ఇందులో మహేష్ పారితోషికం 25 కోట్ల పైమాటే అని టాక్.
ఈ రకంగా మహేష్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తెలుగు హీరోగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఠాగూర్ మధు, ఎన్వి ప్రసాద్ నిర్మించనున్న ఈచిత్రానికి సంబంధించి ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి.
దాదాపుగా శృతి హాసన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ 12 న మొదలవబోతున్న ఈ చిత్రానికి అనిరుద్ లేదా హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తారు.
తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుపుకొని, హిందీ, మళయాళ భాషల్లోకి అనువాదమవుతుంది ఈ చిత్రం.