ఆవిరైన యాకూబ్‌ ఆశలు

ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి యాకూబ్‌ మెమన్‌ ఆశలు అడియాశలయ్యాయి.ఉరిశిక్షను రద్దు చేయాలనే ఆయన విజ్ఞప్తిని తెలుగువాడైన మహారాష్ర్ట గవర్నర్‌ సి.

 Maharashtra Governor Rejects Yakub Memon’s Mercy Plea-TeluguStop.com

విద్యాసాగర్‌ రావు తిరస్కరించారు.దీంతో చివరి ఆశ నీరుగారింది.

ఉగ్రవాది యాకూబ్‌ మెమన్‌ ఉరితీతకు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.అది ఈ రాత్రి మాత్రమే.

సూర్యోదయానికి ముందే యాకూబ్‌ ఈ ప్రపంచాన్ని విడిచిపోతాడు.యాకూబ్‌ క్యూరేటివ్‌ పిటిషన్‌ను (ఉరిశిక్ష తీర్పుపై సమీక్ష చేయాలని కోరడం) సుప్రీం కోర్టు తిరస్కరించిన వెంటనే అతను గవర్నర్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు.

ఈ పిటిషన్‌ను అతను జూలై ఇరవై ఒకటో తేదీన దాఖలు చేసుకున్నాడు.రేపటి ఉరిశిక్షపై స్టే విధించాలన్న యాకూబ్‌ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించడంతో గవర్నర్‌ నిర్ణయం కూడా వెలువడింది.

యాకూబ్‌ను నాగపూర్‌ కేంద్ర కారాగారంలో ఉరి తీస్తారు.మహారాష్ర్ట గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు.

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా వాస్తవ్యుడు.భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్, ఇతర హిందూత్వ సంస్థలు యాకూబ్‌ మెమన్‌ ఉరి శిక్షకు అనుకూలంగా ఉన్నాయి.

ఇలాంటప్పుడు విద్యాసాగర్‌రావు ఉరిని ఆపుతూ నిర్ణయం తీసుకోలేరు.ఒకవేళ ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత పదవిలో ఉండరు.

పార్టీలోనూ ఉంచుతారనే నమ్మకం లేదు.యాకూబ్‌ ఉరి శిక్షను ఎంఐఎం హిందూ-ముస్లింల మధ్య వివాదంగా చిత్రీకరిస్తోంది.

హైదరాబాద్‌లోని పాత బస్తీలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube