సూపర్‌స్టార్‌ మూవీ టైటిల్‌

సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం రంజిత్‌ దర్శకత్వంలో ‘కబాలి’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 Mahadev Title For Rajinikanth’s Kabali-TeluguStop.com

రజినీకాంత్‌ చాలా కాలం తర్వాత తెలుగులో కూడా నేరుగా చిత్రాన్ని చేస్తున్నాడు.భారీ అంచనాలున్న ఈ సినిమాను తెలుగులో సైతం ‘కబాలి’గా విడుదల చేయాలని ముందు నుండి అనుకుంటున్నారు.

అయితే ‘కబాలి’ టైటిల్‌ తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం లేదు.దాంతో తాజాగా నిర్మాణ సంస్థ సినిమా తెలుగు టైటిల్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారు.

‘కబాలి’ కథానుసారంగా పవర్‌ ఫుల్‌గా ఉండే ఒక టైటిల్‌ కోసం గత కొన్ని రోజులుగా తెలుగు యూనిట్‌ సభ్యులు అన్వేషించారు.తాజాగా ఈ చిత్రానికి ‘మహాదేవ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకు రజినీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం.దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కళ్లైపులి థాను నిర్మిస్తున్నాడు.

రజినీ గత రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయినా కూడా ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయి.రాధిక ఆప్టే ఈ చిత్రంలో రజినీ కాంత్‌తో రొమాన్స్‌ చేస్తోంది.

వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మరి ఈ మహాదేవ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube