మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ కాదట!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు ఇంత కాలం టైటిల్‌గా ‘శ్రీమంతుడు’ చలామణి అయ్యింది.అయితే తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు అని తేలిపోయింది.

 Magadu Title For Koratala Siva And Mahesh Babu Movie-TeluguStop.com

ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ పరిశీలన దశలోనే ఉంది అంటూ చిత్ర యూనిట్‌ అనధికారికంగా తేల్చి చెప్పింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మగాడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ టైటిల్‌కు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ నుండి మంచి స్పందన వస్తోంది.

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జులై 17న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

ఇక మే 31న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.అప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.అతి త్వరలో మొత్తం షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసే పనిలో పడ్డాడు దర్శకుడు.

వరుస ఫ్లాప్‌ల తర్వాత మహేష్‌ నటిస్తున్న ఈ సినిమాపై సూపర్‌ ఫ్యాన్స్‌ భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.మరి ‘మగాడు’గా మహేష్‌బాబు అలరిస్తాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube