‘మగధీర’ సెంటిమెంట్‌తో?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’.ఈ సినిమా ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

 Magadheera Sentiment For Baahubali-TeluguStop.com

కాని కొన్ని కారణాల వల్ల మేలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు రాజమౌళి చెప్పుకొచ్చాడు.అయితే తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మేలో కూడా ఈ సినిమా విడుదల కష్టమే అంటున్నారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా చాలా ఉన్నందున ఈ సినిమా జూన్‌ లేదా జులైలో విడుదల అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.మరి కొందరు ఈ సినిమా విడదుల ‘మగధీర’ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని చెప్పుకొస్తున్నారు.

‘మగధీర’ సినిమాను జులై 30న విడుదల చేశారు.ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మళ్లీ ఇప్పుడు ‘బాహుబలి’ సినిమాను కూడా అదే డేట్‌లో విడుదల చేస్తే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కొందరు అంటున్నారట.

దాంతో రాజమౌళి విడుదల తేదీపై ఒక క్లారిటీకి రావడం లేదు.జులై 30న విడుదలైతే ఈ సినిమా సమ్మర్‌ కలెక్షన్స్‌ను కోల్పోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అనే విషయంలో చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన చేస్తే కాని ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube