హైకోర్టులో కాజల్ కి చుక్కెదురు

కాజల్ అగర్వాల్ కి సంబంధించినంత వరకు మనం పెద్దగా వివాదాలు ఏమి వినలేదు.నైట్ క్లబ్బుల్లో హంగామా గురించి కాని, బాయ్ ఫ్రెండ్స్ అఫైర్స్ కాని, సెట్స్ మీద గొడవలు కాని … ఇలాంటి వార్తలలో కాజల్ పేరు వినడం జరగదు.

 Madras High Court Gives A Big Shock To Kajal-TeluguStop.com

మొన్న జరిగిన డ్రగ్స్ కేసు విచారణలో కాజల్ మేనేజర్ పేరు వినిపించింది తప్ప, కాజల్ అయితే సస్పెక్ట్ కానే కాదు.మరి కామ్ గా సినిమాలు చేసుకునే ఈ అమ్మాయి కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ? ఇదే కదా మీ డౌటు.

మీరు కాజల్ అభిమాని అయితే కంగారుపడొద్దు.కాజల్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోలేదు.కాని కాజల్ కోరుకున్నది దొరకలేదు మద్రాసు హైకోర్టు కాజల్ కి హ్యాండ్ ఇచ్చింది.ఇంతకి ఏం జరిగింది అంటే, 2008 సంవత్సరంలో కాజల్ ఒక హెయిర్ ఆయిల్ కంపెనికి ప్రచాకరకర్తగా వ్యవహరించింది.

తానూ నటించబోయే యాడ్స్ కేవలం ఏడాదిపాటు ప్రసారం చేసుకోవాలని, ఆ తరువాత కాంట్రాక్టు పొడిగిస్తే తప్ప అవి వాడుకోకూడదని కాజల్ ఒక కండీషన్ పెట్టిందట.దానికి ఆ కంపెని ముక్తసరిగా జవాబిచ్చింది.

ఏడాది గడిచింది.కాంట్రాక్టు అయిపొయింది.

కాని టీవిల్లో, పేపర్స్ లో ఆ యాడ్ మాత్రం ఆగలేదు.దాంతో కాజల్ కి కోపం వచ్చింది.

మద్రాసు హైకోర్టులో ఆ కంపెనికి వ్యతిరేకంగా కేసు వేసింది.తనకు 2.50 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టుని కోరింది.ఇప్పుడు, తొమ్మిదేళ్ళ తరువాత కోర్టు తీర్పునిచ్చింది.ఆ యాడ్ ని ఇష్టం ఉన్నన్నిరోజులు ప్రసారం చేసుకునే హక్కు కంపెనికి ఉంది.60 ఏళ్ల పాటు వాడుకోవచ్చు.దీనిపై మీకు ఎలాంటి అధికారం లేదు అంటూ షాక్ ఇచ్చింది.పెట్టిన కేసుకి కోట్లు కాదు రూపాయి రాకపోగా, ఇన్నేళ్ళు లక్షలు పెట్టి లాయర్స్ ని మేపాల్సి వచ్చింది కాజల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube