అంగస్తంభన సమస్యకి సరికొత్త చికిత్స

ఒత్తిడి వల్లో, జీన్స్ వల్లో, చాలామంది మగవారికి అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి.అంగం సరిగా గట్టిపడక, సెక్స్ సమస్యలతో సెక్సాలాజిస్టులను సంప్రదిస్తున్నారు వేలమంది.

 Low Intensity Shock Wave Treatment Can Fight With Erectile Dysfunction-TeluguStop.com

ఈ అంగస్తంభన సమస్యకు మార్కేట్లో చాలారకాల మందులు దొరుకుతున్నాయి.కాని దురదృష్టవశాత్తు ఆ మందులు అందరి సమస్య తీర్చలేకపోతున్నాయి.

కొందరి శరీరం అంగస్తంభన సమస్య కోసం ఉపయోగించే మందులకు అస్సలు రెస్పాండ్ కూడా అవడం లేదు.ఇలాంటి సమయంలో మరో సరికొత్త చికిత్సతో ముందుకొచ్చారు అమెరికా పరిశోధకులు.

దీని పేరే “లో- ఇంటెన్సిటి షాక్ వేవ్ ట్రీట్‌మెంట్” ఇది ఇంకా పూర్తిగా వాడకంలోకి రాలేదు.ప్రస్తుతం ప్రయోగాలు, చర్చలు జరుగుతున్నాయి.

ఈ ట్రీట్‌మెంట్ వలన పురుషాంగంలోకి రక్తప్రసరణ బాగా జరిగి, అంగస్తంభనలు బాగా జరుగుతాయని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన టామ్ లూయి తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు మంచి ఫలితాలనిచ్చినా, అప్పుడే “లో- ఇంటెన్సిటి షాక్ వేవ్ ట్రీట్‌మెంట్” ని ఒక చికిత్స లాగా వాడకంలోకీ తేలేమని, మరికొన్ని ప్రయోగాల తరువాత, దీంట్లో తీసుకురావాల్సిన మార్పులు తీసుకొచ్చి, అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే వయాగ్రా వాడలేని మగవారికి ఈ ట్రీట్‌మెంట్ గొప్ప వరంలా మారబోతోందని పరోశోధకులు అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube