50 ఏళ్ళ తరువాత శృంగారం రెగ్యులర్ గా చేస్తే ఆ సమస్య తగ్గుతుందట

ఈరోజు మనమే ఓ చోట వస్తువు, రేపు వెతికితే ఎక్కడుందో అర్థం కాదు.అంటే గుర్తుకు రాదు.

 Lovemaking After 50’s Will Improve Brain Functioning – Study-TeluguStop.com

ఇక్కడే ఎక్కడో పెట్టానే అంటూ ఇళ్ళంతా సర్దేస్తాం.చివరకి దొరుకుతుంది.

అయ్యో, ఇక్కడ పెట్టిన వవిషయన్ని అలా ఎలా మర్చిపోయాను అంటూ ఆస్చర్యపోతాం.మనలో చాలమందికి జరిగేదే ఇది.మంచి వయసులో ఉండగానే ఇలాంటి పరిస్థితి ఉంటే 50 ఏళ్ళు దాటిన తరువాత మతిమరుపు ఇంకే రేంజ్ లో ఉంటుందో మీరే ఆలోచించండి.ఈ మతిమరుపుకి విరుగుడు రెగ్యులర్ శృంగారమని అంటున్నారు పరిశోధకులు.

ఇంగ్లాండ్ లోని కోవెంట్రి యూనివర్సిటీకి చెందిన రిసెర్చర్స్ 50 నుంచి 83 ఏళ్ళ వయసున్న 73 మందిపై ఓ రీసెర్చి చేసారు.వారికి రెగ్యలర్ గా శృంగారం చేయమని సలహా ఇచ్చి, రకరకాల పజిల్స్ తో, టెస్టులతో బ్రెయిన్ ఫంక్షన్ పాటర్న్ ని టెస్టు చేసారు.

వారు ఊహించినట్టుగానే రెగ్యులర్ గా చేసే శృంగారం వలన బ్రెయిన్ ఫంక్చనింగ్ చాలా మెరుగుపడిందట.చిన్న చిన్న పేర్ల నుంచి, కొన్ని పెద్ద లెక్కలవరకు చాలావిషయాల్ని మునుపటి కంటే బాగా గుర్తుపెట్టుకుంటున్నారు.ఈ మార్పు శృంగారం వలనే వచ్చిందట.

” ఏంటి 50 ఏళ్ళ తరువాత కూడా శృంగారంలో పాల్గొంటారా, అసలు పాల్గొనగలరా అని అనుకుంటారు జనాలు.అలాంటివారికి తామేంటో నిరూపించుకోవడానికి, సమాధానం ఇవ్వడానికైనా బలాన్ని కూడకట్టుకోని శృంగారించాలి.ఎందుకంటే అది అరోగ్యానికి కూడా మంచిది.పెద్ద పెద్ద రోగాలని కూడా దగ్గరకి రానివ్వదు శృంగారం.ఈ మతిమరుపు అనేది చిన్న విషయం.

మార్పు మీకే కనిపిస్తుంది.ఇలా ఎందుకు జరుగతోంది, శృంగారం వలన ఈ వయసు వారి మెదడు ఎందుకు అంత చురుకుగా పనిచేస్తోంది అనే విషయాల మీద ఇంకా రిసెర్చి చేయాలనుకుంటున్నాం.

శృంగారం వలన విడుదలయ్యే ఆక్సిటోసిన్, డోపామైన్ బ్రెయిన్ ఫంక్చన్ పై ఏరకంగా పనిచేస్తోందో కూడా చూడాలి.అయినా ఎలా జరిగతే ఏంటి, శృంగారం మన ఆరోగ్యానికి మంచిదైనప్పుడు” అంటూ చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ హేలే వ్రైట్.

హార్మోన్ల బ్యాలెన్స్ ఎలాగో మెరుగుపరుచుతుంది, శృంగారం వలన మెదడుకి రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది.అందుకే మెదడు చురుకుగా పనిచేస్తుంది.

చరుకుగా ఆలోచిస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది.అందుకే, 50 ఏళ్ళు దాటినా, ఇది అనువైన వయసు కాదేమో అనే అనుమానం పెట్టుకోకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube