తొంభై ఏళ్ళ ప్రేమ , పెళ్ళికి సిద్దం..

ప్రేమ గొప్పది అని కవులు చెబుతుంటారు…బ్రిటన్ కు చెందిన రాయ్ వికర్ మాంట్ (90), నోరా జాక్సన్(89) కధ చదివితే ప్రేమ గొప్పది అనిపిస్తుంది.వివరాల్లోకి వెళ్తే…రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న బ్రిటన్ సైనికుడు రాయ్ వికర్ మాంట్ 1940లో నోరా జాక్సన్ ను కలిశాడు.

 Love At 90 Years-TeluguStop.com

ఆ పరిచయం ప్రేమగా మారింది.దీంతో 1946లో వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

కొద్ది రోజుల్లో వివాహం చేసుకుందామని భావించారు.ఇంతలో యుద్ధం కారణంగా రాయ్ అనారోగ్యం పాలయ్యాడు.

తరువాతా వారిద్దరూ విడిపోయారు.తరువాత కొంత కాలానికి ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు.

జీవితం ఎంత సాగినా రాయ్ ప్రియురాలిని మర్చిపోలేదు.ఈ క్రమంలో రాయ్ భార్య మరణించడంతో ఒంటరిగా మారాడు.

స్థానిక రేడియో సహాయంతో తన ప్రేయసి గురించి తెలుసుకున్నాడు.తనకు కేవలం రెండు మైళ్ల దూరంలో ఉందని తెలియడంతో వెళ్లి కలిశాడు.

ఆమె భర్త మరణించి ఆమె కూడా తనలా ఒంటరిగా ఉందని గుర్తించాడు.దీంతో తన 90వ ఏట గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రేమకు పూర్తి రూపమిస్తూ పెళ్లి ప్రపోజల్ చేశాడు.

దీంతో ఆమె కూడా అంగీకరించడంతో పాత ప్రేమికులు దంపతులు కానున్నారు.త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube