ఉల్లిగడ్డ పొట్టు కూడా ఆ సమస్య మీద పనికివస్తుంది

కాయలు పండ్లే కాదు, వాటి మీద ఉండే తొక్కలు కూడా లాభాల్ని చేకూర్చేవి.ఉదాహరణకి అరటితొక్కనే తీసుకోండి.

 Look What Onion Peels Can Treat With A Simple Process-TeluguStop.com

అది జిడ్డు చర్మలోంచి జిడ్డుని బయటకి తీస్తుంది.మొటిమలపై పోరాడుతుంది, స్కిన్ లో గ్లో తీసుకొస్తుంది, దానితో దంతాలు కూడా శుభ్రం చేసుకోవచ్చు.

బొప్పాయి ఆకులనే తీసుకోండి.అది మొండిజ్వరాలపై కూడా పనిచేస్తుంది.

అలాగే అరేంజ్ పీల్ ఫేస్ వాషింగ్ స్క్రబ్ లా పనిచేస్తుంది.తాజాగా ఉల్లి పొట్టు కూడా శరీరానికి ఏంతో మేలు అని, మనం ఊహించని లాభాలని అందిస్తుందని చెబుతున్నారు.

ఉల్లిలో మాన్గానీజ్, పొటాషియం, విటమిన్ సి, బి6 ఉంటాయి.ఇది కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది, రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది ఇంకా బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

అలాంటి ఉల్లిలో భాగమైన పొట్టు కూడా తక్కువేమీ కాదు.ఇది హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ ని గణనీయంగా తగ్గిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు.

ఉల్లిపొట్టుతో ఒరకమైన డ్రింక్ తయారుచేసుకొని, అది రోజుకి రెండుసార్లు తాగితే రక్తపోటు సమస్యలు, గుండెపోటు సమస్యలు, వాటితో పాటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయట.మరి ఆ డ్రింక్ ఎలా తయారుచేస్తారో చూడండి.

* ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఆ పొట్టు అంతా తీయండి

* పోట్టంతా రెండు కప్పుల నీటిలో వేసి బాగా నాననివ్వండి

* ఇప్పుడు ఈ నీటిలో ఆ పొట్టుతో సహా మరిగించండి.అలానే ఓ ఇరవై నిమిషాలు ఉంచండి

* ఇప్పుడు నీటిలోంచి పొట్టు బయటకు తీసి గోరువెచ్చగా ఉండగా తాగేయండి

* ఇలా పొద్దున్న, రాత్రి రెండు సార్లు చేయండి.

కొన్నిరోజుల్లోనే మీ రక్తపోటు సమస్య తగ్గుతుంది.మీ ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

అయితే గర్భిణి స్త్రీలు ఎవరైనా ఉంటే దీన్ని తాగకపోవడమే మంచిది.మిగితావారు నిర్భయంగా తాగోచ్చు.

ఇది కొవ్వుని కూడా తగ్గిస్తుంది.మెటబాలిజం రేటుని ట్రాక్ లో పెడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube