"పొకిమన్ గో" వలన ఫేస్ బుక్, యూట్యూబ్ కి ప్రమాదం

చిన్నప్పుడు పొకిమన్ కార్టూన్ అంటే ఇష్టపడని వారుండరు.స్మార్ట్ ఫోన్లు లేని సమయంలో, ఆ కార్టూన్ చూడటమే అతిపెద్ద టైమ్ పాస్ మరి.

 Look How Pokemon Go Is Troubling Facebook And Youtube-TeluguStop.com

అంత ఫేమస్ కార్టూన్ మొబైల్ గేమ్ రూపంలో, అదికూడా అత్యాధునిక టెక్నాలజీతో వచ్చేసరికి జనాలు ఎగబడి డవున్లోడ్ చేసుకుంటున్నారు.విపరీతంగా ఆడేస్తున్నారు.

ఇప్పటికే అత్యంత ఫేమస్ మొబైల్ గేమ్ గా పేరు సంపాదించుకుంది పోకిమన్ గో.

దీన్ని ఆడుతూ కెనడా సరిహద్దులు కూడా దాటేసారు ఇద్దరు అమెరికన్లు.ఎక్కడున్నాం, ఎటు వెళ్తున్నాం అని గమనించకుండా వేరే ఇంట్లోకి, ఆఫీసుల్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు.అంతలా పోకిమన్ పిచ్చి పట్టుకుంది.ఇప్పుడు ఈ పోకిమన్ ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లకి కూడా చెమటలు పట్టిస్తోంది.

తాజా అధ్యయనాల ప్రకారం, ఈ గేమ్ ఆడుతున్నవారు సోషల్ నెట్వర్కింగ్ ఖాతాలు ఓపెన్ చేయడం తక్కువ చేసి, ఎక్కువసేపు గేమ్ ఆడుతూ గడుతున్నారట.

పోకిమన్ గో యూజర్లు సగటున 75 నిమిషాలు గేమ్ ఆడితే, అరగటం మాత్రమే ఫేస్ బుక్ లో గడుపుతున్నారట.అలాగే యూట్యూబ్ వాడకం 9% శాతం పడిపోయిందట.

స్నాప్ చాట్ వాడకం 18% వరకు ఈ గేమ్ వల్లే తగ్గిపోయింది.చూసారా … ఒక్క గేమ్ బాడా బాబులకి ఎంత పెద్ద షాక్ ఇచ్చిందో.

గేమింగ్ ప్రపంచంలో పోకిమన్ గో ఒక సంచలనం.ఇంకా ఇది ప్రపంచమంతటా అందుబాటులోకి రాలేదు.ఇది అందరి చేతికి వచ్చాక, సోషల్ నెట్వర్కింగ్ సైట్లకి పట్టపగలే చుక్కలు కనిపించడమం ఖాయమని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube