GST ఎన్టీఆర్ కి ఎలాంటి చుక్కలు చూపించింది అంటే

GST కి ముందు ఫిదా విడుదల అయ్యుంటే, 50 కోట్లు సులువుగా చేసి ఉండేది.నిన్ను కోరి 30 కోట్ల క్లబ్ మిస్ అయ్యేది కాదు.దువ్వాడ జగన్నాథం వచ్చిన ఆ కొన్ని నష్టాలని తప్పించుకునేదేమో.14% ఉన్న ట్యాక్స్ 18 శాతానికి పెరిగింది GST అమలు వలన.100 రూపాయల నెట్ వచ్చేలా, రఫ్ గా చెప్పాంటే, అన్ని కలుపుకొని 120 రూపాయలు, అంతకన్నా తక్కువ టికెట్ రేట్ ఉంటేనే GST 18% పడుతుంది.లేదంటే, ఏకంగా 28%.వంద రూపాయల్లో 28 రూపాయు ప్రభుత్వానికే చెల్లిస్తే, థియేటర్ రెంట్స్ పోనూ మిగిలే షేర్ ఎంత? మామూలు వాయింపు కాదు కదా ఇది.ఇక్కడ మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, టికెట్ రెట్లు చాలా చోట్ల జై లవ కుశ కోసం పెంచేసారు.ఉదాహరణకి ఉత్తరాంధ్రలోని చాలావరకు సింగల్ స్క్రీన్స్ లో టికెట్ రెట్లు 200/150 బాల్కని, 100 డ్రెస్ సర్కిల్, 50 థర్డ్ క్లాస్ చేసారు.టికెట్ రేటు పెరిగితే, ఆక్యూపెన్సి తగ్గే అవకాశాలు ఉంటాయి.

 Look How Gst Snatched Few Records From Ntr-TeluguStop.com

ఇటు ప్రేక్షకులపై భారం, అటు నిర్మాతలు, పంపినిదారులపై కూడా భారం

జై లవ కుశ లెక్కల్ని తీసుకుంటే, నైజాంలో బాహుబలి తరువాత అతిపెద్ద రిలీజ్.కాని షేర్ శ్రీమంతుడు కన్నా తక్కువ.మొదటిరోజు షేర్ 5.05 కోట్లు.అదేంటి, ఇలా ఘోరంగా ఆడింది సినిమా అనుకునేరూ.మొదటిరోజు గ్రాస్ కలెక్షన్ 8.1 కోట్లు.ఇది కొత్త నాన్ – బాహుబలి రికార్డ్.

కాని GST ప్రభావం వలన షేర్ రికార్డు రాలేదు.తెలుగు రాష్ట్రాల మొత్తం గ్రాస్ 32 కోట్లు.

ఇది కూడా కొత్త నాన్ – బాహుబలి రికార్డ్.కాని షేర్ కలెక్షన్లను లెక్కలోకి తీసుకుంటే జై లవ కుశ స్థానం నెం5.

అంతా GST బాదుడు వలనే

ఈ ఎఫెక్ట్ స్పైడర్ మీదా ఇంకా భారిగా పడుతుంది.అసలే జై లవ కుశ ఉండటం వలన స్పైడర్ కి రికార్డు రిలీజ్ దొరకదు తెలుగు రాష్ట్రాల్లో.

చాలిచాలని థియేటర్స్ లో, GST పెట్టుకొని మొదటి రోజు రికార్డులు ఎలా వస్తాయి? ఇకనుంచి ఇలా పెద్ద హీరోల సినిమాలు పోటిలో విడుదల కాకపోతేనే బెటర్.అలాగే సోలోగా వచ్చిన సినిమాల షేర్ కలెక్షన్ల కంటే, గ్రాస్ కలెక్షన్లు పోల్చి చూసుకుంటే బెటర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube