ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది

ఇంట్లో సమస్యలు, పనుల గురించి పురుషుల కంటే ఎక్కువ పట్టించుకుంటారు మహిళలు.అందువలన మానసిక ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది.

 Long Work Hours Will Increase The Risk Of Cancer In Women-TeluguStop.com

ఇక ఉద్యోగం చేసే మహిళలకైతే ఒత్తిడి మరింత పెరిగిపోతుంది.ఇటు ఇల్లు చూసుకోవాలి, అటు ఆఫీసు పని చూసుకోవాలి, ఇంటికి తిరిగొచ్చాక మళ్ళీ ఇంటిపని చూసుకోవాలి అంటే, పెద్ద భారమే తలమీద పడుపోతుంది.

అలాంటి మహిళలకి క్యాన్సర్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువంట.

ది ఓహియో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ చేసిన ఓ రీసెర్చిలో ఈ విషయం బయటపడింది.

వారానికి 40, అంతకంటే ఎక్కువ పనిగంటలు ఉండి, అలాగే ఓ మూడు దశాబ్దాల పాటు పనిచేస్తే, ఈ ప్రపంచం నుంచి త్వరగా వెళ్ళిపోతారట మహిళలు.

అయితే అబ్బాయిలకు, అమ్మాయిలకు ఉన్నంత ప్రమాదం లేదంట.

ఆఫీసు దాటితే, పని ఒత్తిడి మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం వలన, పురుషులకి ఇది పెద్ద సమస్య కాదు.అందుకే వయసులో ఉన్నాం కదా అని పగలంతా అఫీసులో పనిచేసి, మళ్ళీ ఇంటిపనులు కూడా చూసుకునే అమ్మాయిలు ఇకనుంచైనా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube