Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జేపీల‌కు జై కొడ‌దాం.. మంచికి ప‌ట్టం క‌డ‌దాం!-Lok Satta Jayaprakash Narayan Political Movement

రాజ‌కీయాలు నానాటికీ భ్ర‌ష్టు ప‌ట్టిపోతున్నాయి! ప్రెజెంట్ పాలిటిక్స్ చూస్తుంటే ఏవగింపు పుడుతోంది! ఏ న‌లుగురు క‌లిసినా ఇలాంటి కామెంట్లు వినిపించ‌డం కామ‌నై పోయింది! అంతేకాదు, ఆ నేత అంత తిన్నాడు, ఈ నేత ఇంత వెనుకేసుకున్నాడు లాంటి చ‌ర్చ‌లకు లెక్కేలేదు. నిజ‌మే!! పాలిటిక్స్ నేడు పాలిట్రిక్స్‌గానే మారిపోయాయి. ఎన్నిక‌ల్లో కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాం… ఆ మాత్రం సంపాయించుకుంటే త‌ప్పేంటి? అని నేరుగా ప‌బ్లిక్‌లోనే ప్ర‌శ్నిస్తున్న నేత‌లను మ‌నం చూస్తున్నాం. ముక్కున వేలేస్తున్నాం!!

అయితే, పాలిటిక్స్‌లో ఉన్న వాళ్లంతా ఇలానే ఉన్నారా? అంద‌రూ సొంత లాభాల కోస‌మే పాలిటిక్స్‌లోకి వ‌స్తున్నారా? వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు పాదు క‌ట్టి.. ఎరువు పెట్టి.. ప్రాపు చేస్తున్నారా? రాజ‌కీయం అంటే హ‌ద్దు , అదుపులేని అధికారం చ‌లాయించ‌డం, అందిన‌కాడికి దండుకోవ‌డ‌మేనా? అంటే.. కాద‌ని చెప్పేవారూ, ప‌లువురికీ ఆద‌ర్శంగా ఉండే వారూ.. వేల‌ల్లో ఒక్క‌రై రికార్డు సృష్టించే వారూ ఒక‌రిద్ద‌రు ఉన్నారు. అలాంటి వారు స‌మాజం కోసం, స‌మాజంలోని అణ‌గారిన వ‌ర్గాల కోసం నిత్యం పోరు స‌ల్పుతూనే ఉంటారు. జ‌న హిత‌మే త‌మ విహిత ధ‌ర్మంగా అడుగులేస్తూనే ఉన్నారు!

అలాంటి వారిలో మ‌ట్టిలో మాణిక్యం వంటి నేత నాగ‌భైర‌వ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ. అందరూ జేపీగా పిలుచుకునే ఈయ‌న.. ఆద‌ర్శ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు. రాజ‌కీయాలంటే.. ఒక‌రినొక‌రు తిట్టుకోవ‌డం కాదు.. రాజ‌కీయాలంటే.. అధికారం చ‌లాయించ‌డం కాదు.. అని ప‌దేప‌దే చెప్పుకొచ్చే జేపీ.. కూక‌ట్‌ప‌ల్లి ఎమెల్యేగా ఉన్న స‌మ‌యంలో ఈ రెండు మాట‌ల‌ను త‌న ప్ర‌వ‌ర్త‌న ద్వారా ఆచ‌రించి చూపి ఆద‌ర్శంగా నిలిచారు. లోక్‌స‌త్తా – పేరుతో ఓ సామాజిక ఉద్య‌మ సంస్థ‌ను స్థాపించిన జేపీ.. అవినీతిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు, సామాజిక బాధ్య‌త‌ను ర‌గిలించేందుకు ఎంత‌గానో శ్ర‌మించారు. లోక‌స‌త్తా జేపీగా ప్ర‌జా బాహుళ్యంలో ప్ర‌త్యేక గుర్తింపు పొందారు.

వాస్త‌వానికి ఐఏఎస్ అధికారి అయిన జేపీ.. మ‌హారాష్ట్ర‌లో తెలుగు మాట్లాడే వారి ఇంట జ‌న్మించారు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్‌గా, క‌లెక్ట‌ర్‌గా అనేక జిల్లాల్లో ఆయ‌న ప‌నిచేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల స్థితిగ‌తుల‌పై విధుల్లో ఉండ‌గానే అధ్య‌య‌నం చేశారు. అదేసమ‌యంలో స‌మాజంలో పెచ్చ‌రిల్లిన అవినీతి ఆయ‌న‌ను కంటిపై కునుకులేకుండా చేసింది. స‌మాజానికి త‌న‌వంతుగా ఏదో ఒక‌టి చేయాల‌ని ఆయ‌న ఆ క్ష‌ణంలోనే డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఉద్భవించిందే లోక్‌స‌త్తా ఉద్య‌మం.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top