రేవంత్ తో పాటు భారీ వలసలు..లిస్ట్ ఇదే

రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఖాయం అయ్యింది.అయితే తానూ ఒక్కడే కాంగ్రెస్ లోకి వెళ్ళడంలేదని కొందరు యువనేతలు రేవంత్ బాటలోనే నడుస్తారు విషయం గుప్పుమంది.

 List Of Tdp Mlas Into Congress-TeluguStop.com

రేవంత్ రెడ్డి నిర్ణయానికి మేముకూడా మద్దతు పలుకుతున్నాం.టీ –టిడిపి టీఆర్ఎస్ తో కలిసి చెట్టాపట్టాలు వేసుకుంటే ఆ పార్టీలో ఉండే సీనియర్ నాయకులూ మమ్మల్ని ఎదగనివ్వరు అని వారు బహిరంగానే అంటున్నారట అందుకే నెమో మేము కూడా రేవంత్ బాటలోనే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్దపడ్డాము అని అంటున్నారు.

రేవంత్ తో పాటు వాళ్ళు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిన సమయంలో తన వెంట వచ్చే నేతలకు కూడా టిక్కెట్లు ఇచ్చే విషయంపై ఒక క్లారిటీ తీసుకున్నారట.

అయితే మీరు పార్టీలోకి వచ్చే సమయంలో భారీ వలసలు.అధికార పక్షం నుంచీ టి –టిడీపి నుంచీ ఉండాలని రాహుల్ గాంధీ సూచించారట

రాహుల్ కోరికమేరకు ఢిల్లీ నుంచేకధ నడిపిన రేవంత్ వేగంగా సమీకణాలని మార్చేశారు.

ఎవరెవరికి ఎటువంటి హామీలని ఇచ్చారనేది పక్కనపెడితే.రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి వెళ్లేవారి లిస్టు చాలా భారీగానే ఉందని తెలుస్తోంది.

సుమారుగా 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులతో పాటు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం.ఈ వలసలు ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట¸ వికారాబాద్, మేడ్చల్, భూపాలపల్లి, జిల్లాల నుంచి ఫిరాయింపులు అధికంగా ఉండవచ్చని అని అంచనా.

ఒకవేళ ఈ పదహారు జిల్లా నేతలు ఒకేసారి కాంగ్రెస్ లోకి జంప్ అయితే తెలంగాణలో టిడీపి పని ఖాళీనే అని తెలుస్తోంది.

అయితే రేవంత్ తో పాటు ఢిల్లీ వెళ్ళిన నేతల్లో అందరు యువనేతలే ఉన్నట్టుగా తెలుస్తోంది.

ముఖ్యంగా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి రేవంత్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది.వీరితో పాటు మరికొందరు ముఖ్యనేతలు కూడా రేవంత్ వెంట నడిచే అవకాశముంది.

అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ కు స్పష్టమైన హామీ లభించిందని వీరు తమ సన్నిహితులకు ఫోన్ ద్వారా చెప్పినట్లు సమాచారం.అంతేకాదు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన వేం.నరేంద్ర రెడ్డి కూడా పార్టీని వీడి రేవంత్ తో పాటు వెళుతున్నారు అని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇక్కడే మరొక ట్విస్ట్ ఉంది.

రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్న నేతల్లో కేవలం టిడిపి వాళ్ళు మాత్రమే కాదు అధికార పక్షానికి సంభందించిన వాళ్ళుకూడా ఉన్నారు అని విశ్వసనీయ సమాచారం.ఈమధ్యనే కొందరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అధినేత కేసీఆర్ పై కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఆ కామెంట్స్ కేసీఆర్ వరకు వెళ్లకపోయినా.వాళ్ళు కూడా తీవ్రమైన అసంత్రుప్తిలో ఉన్నారట.

కారణం ఏమిటంటే ఒక ఎమ్మెల్యే మేము బీసీ అని మా ఎంపీ గౌరవం కూడా ఇవ్వడం లేదని.కొందరు మంత్రులు కూడా మమ్మల్ని హీనంగా చూస్తున్నారు అని భాహాటంగానే అంటున్నారు.

ఈ గొడవ కేసీఆర్ వరకూ వెళ్ళినా ఆ ఎమ్మెల్యేనే మండలించారని దాంతో సదరు ఎమ్మెల్యే మనస్తాపంతో ఉన్నారని తెలుస్తోంది.ఇలా వచ్చే ఎన్నికల్లో టికెట్స్ రావు అని భావిస్తున్న సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ తో టచ్ లో ఉన్నారట.

అయితే అధికార పక్షం నుంచీ వలసలు ఇప్పటికిప్పుడు కాకుండా ఇంకో ఏడు నెలలు గడిచిన తరువాత ఉంటుందని తెలుస్తోంది.మొత్తం మీద రేవంత్ పార్టీని వీడటం తెలంగాణ తెలుగుదేశంపార్టీ నేతలకి మరియు అధికార పక్ష నేతలకి అందోళన కలిగించే అంశమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube