2015లో బాహుబలి రిలీజ్ అయ్యాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఒకే ఒక్క ప్రశ్న ఇండియన్ సినిమా జనాల మదిని ఓ రేంజ్లో తొలచివేస్తోంది.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ఓ రేంజ్లో వైరల్ అయ్యింది.
రెండేళ్ల సుదీర్ఘవిరామం తర్వాత ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికేరోజు వచ్చేసింది.ఈ శుక్రవారం బాహుబలి 2 థియేటర్లలోకి వచ్చేస్తోంది
బాహుబలి – ది కంక్లూజన్లో ఈ ఒక్క ప్రశ్నకే కాదు.
ఇంకా సమాధానం రావాల్సిన చాలా ప్రశ్నలు ఉన్నాయి.ఈ ప్రశ్నల లిస్టులో ఫస్ట్ ప్రశ్న మాత్రం ‘వై కట్టప్పా కిల్డ్ బాహుబలి ?’ ఉంటుంది.ఈ ప్రశ్నతో పాటు బాహుబలి 2లో ఆన్సర్ దొరకాల్సిన ప్రశ్నల లిస్టులో ఈ ప్రశ్నలు ఉన్నాయి
1- కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ?
2- శివగామి చనిపొయే ముందు పరమేశ్వరా నేను చేసిన పాపాలుకు పాయశ్చిత్తంగా నా ప్రాణాలు తీసుకో అని చెబుతుంది.శివగామి చేసిన పాపం ఏంటి ?
3- భల్లాలదేవ కొడుకు భద్ర ఐతే.అతని భార్య ఎవరు ?4- ఫర్షియా రాజు అస్లామ్ ఖాన్ కు కట్టప్ప కు మైత్రి బాగా ఉంది కాబట్టి ఆఖరి పోరాటం లో కట్టప్ప తరుపున యుద్దం చేస్తాడా ?
5- మాహిష్మతి రాజ్యంను రక్షించే బాధ్యత కట్టప్పది.అతడి తర్వాత ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ?
6- బాహుబలి రాజ్యంలో సుబ్బరాజు పాత్ర ఏమిటి ?
7- అనుష్క రాజ్యం తరపున ప్రభాస్ ఎప్పుడు యుద్ధం చేస్తాడు ?
8- ఇంతకు ప్రభాస్వి సినిమాలో రెండు క్యారెక్టర్లా.? లేదా మహేంద్ర బాహుబలి – అమరేంద్ర బాహుబలి – శివుడు అని మూడు క్యారెక్టర్లలో ప్రభాస్ ఉంటాడా ?
ఈ ప్రశ్నలు అన్నీ జాగ్రతగా గుర్తు పెట్టుకొని ఏప్రిల్ 28న సినిమా చూడండి.ఈ ప్రశ్నలకు మీకు ఆ రోజే ఆన్సర్లు దొరుకుతాయి.