క్రికేట్ లో కొత్త రూల్స్ ఇవే .. ఆటలో కొన్ని మార్పులు

క్రికేట్ .భారత్ లో ఒక మతం.

 List Of New Cricket Rules .. From Drs To Red Card-TeluguStop.com

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో జాతీయ క్రీడ.ఒలంపిక్స్ లో లేకున్నా, ప్రపంచలోని అత్యంత పాపులర్ క్రీడల్లో ఒకటి.

భారత క్రికేట్, ఐపియల్ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ధనిక క్రీడల్లో కూడా ఒకటిగా నిలిచింది క్రికేట్.ఈ ఇంగ్లీష్ ఆటను మరింత జనరంజకం చేయడానికి ఇంటర్నేషనల్ క్రికేట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు, కాలానికి తగ్గట్టుగా మార్పులు చేస్తూనే ఉంది.

ఓవర్ కి ఎనిమిది బాల్స్ కాస్త ఓవర్ కి ఆరు బాల్స్ గా మారాయి.ఆ తరువాత వన్డే క్రికేట్, రంగుల బట్టలు, ఆ తరువాత అతి సంచలనాత్మకమైన టీ20 క్రికేట్.

మధ్యలో పవర్ ప్లే మార్పులు, ఫ్రి హిట్ .ఇలా క్రికేట్ లో చేసిన ఎన్నో మార్పులు ఆటని మరింత రసవత్తరంగా మార్చాయి.ఇప్పుడు డీఅర్ఎస్ (డిసిజన్ రివ్యూ సిస్టమ్) లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు.క్రికెట్‌ లోని కొత్త రూల్స్ కి ఐసిసి ఆమోదం తెలిపింది.

ఎంపైర్ డిసిజన్ ని ఛాలెంజ్ చేస్తూ ఆటగాళ్ళు టీవి అంపైర్ సహాయం తీసుకోవచ్చని మీకు తెలుసు.ఇన్నింగ్స్ లో ఒక్కో జట్టుకి రెండు అవకాశాలు ఉంటాయి.

అయితే రివ్యూ ఫెయిల్ అయితేనే ఓ అవకాశం కోల్పోతుంది జట్టు.అదే రివ్యూ సక్సెస్ అయితే అవకాశాలలో కోత ఉండదు.

ఇక్కడ ఓ సమస్య వచ్చి పడంది.ఒకవేళ అంపైర్ ఇచ్చిన సాఫ్ట్ సిగ్నల్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరకనప్పుడు, ఐంపర్ కాల్ మీదే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు థర్డ్ అంపైర్.

ఒక్కోసారి అంపైర్ నిర్ణయంలోనే తప్పు ఉన్నా, అదే నిర్ణయం కరెక్టుగా మారి, రివ్యూ అడిగిన జట్టుకి అవకాశాల్లో ఓ కోత పడుతుంది.ఇది ఓరకంగా అన్యాయమే.

అందుకే కొత్త రూల్ తీసుకొచ్చారు.ఇకనుంచి అంపైర్ కాల్ ముందు ఓడిపోయిన రివ్యూని జట్టు రివ్యూ అవకాశాల్లోంచి కోయరు.

మీకు ఇంకా అర్తమయ్యేలా చెప్పాలంటే …

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ ప్యాడ్స్ కి బంతి తగిలింది అనుకుందాం.దానికి ఎంపైర్‌ నాటౌట్ ప్రకటిస్తే, కొహ్లీ రివ్యూ తీసుకున్నాడు అనుకుందాం.

ఒకవేళ రివ్యూలో స్పష్టమైన సాక్ష్యాలు దొరకక, థర్ట్ ఎంపైర్ కూడా ఫిల్డ్ లో ఉన్న ఎంపైర్ నిర్ణయం మీదే ఆధారపడి “ఎంపైర్స్ కాల్” మీద నాటౌట్ ప్రకటిస్తే, భారత జట్టు తన రెండు రివ్యూ అవకాశాల్లో ఒకటి కూడా కోల్పోదు అన్నమాట.ఇదే కేసులో స్పష్టమైన సాక్ష్యాలు దొరికి ఎంపైర్ నిర్ణయమే సరైనది అని తెలిస్తే మాత్రం ఓ అవకాశాన్ని కోస్తారు.

అలాగే ఇక టీ20ల్లో కూడా ఈ డీఆర్ఎస్ ని ప్రవేశపెట్టనున్నారు.అక్టోబరు 1వ తేది నుంచి మైదానంలో ఆటగాడి ప్రవర్తన సరిగా లేకపోతే అతడికి రెడ్ కార్డు చూపించి, ఆటలోంచి బయటకి పంపించే శక్తి ఎంపైర్ చేతిలో ఉంటుంది.

ఇక ఒకసారి బ్యాట్ గ్రౌండ్ అయ్యాక, అది తిరిగి గాలిలో లేచి ఉంటే, దాన్ని రనౌట్ గా ప్రకటించరు.బ్యాట్ ని రన్ పూర్తి చేస్తే ఒక్కసారి గ్రౌండ్ చేస్తే సరిపోతుంది.

ఇక కొత్త నిబంధనల ప్రకారం క్రికేట్ బ్యాటు సైజు 108mm width, 67mm depth, 40mm edges .ఈ కొలతలకి మించరాదు.దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ వాడే భారి బ్యాట్లు ఇకనుంచి క్రికేట్ లో కనిపించవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube