భారతదేశంలో ఎక్కువ అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్లు ఏవో తెలుసా?

మీరు ఏ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు? మీ ఫ్రెండ్స్ ఏ ఫోన్ వాడుతున్నారు? మీ చుట్టాలు ఏ ఫోన్ వాడుతున్నారు? అందరు ఒకే కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లు వాడట్లేదు కదా.మీ ఇంట్లోనే రెండుమూడు రకాల కంపెనీ ఫోన్లు వాడుతుంటారు.మరి ఎప్పుడైనా అనిపించిందా, మన దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మొబైల్ బ్రాండ్ ఏది అని? తెలుసుకోవాలని ఉందా? అయితే భారతదేశం మొబైల్ మార్కేట్ పై రిసెర్చి చేసి ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ విడుదల చేసిన ఈ ర్యాంకు లిస్టు చూడండి.

 List Of Most Selling Mobile Brands In India-TeluguStop.com

1) సామ్ సంగ్

ఎప్పటినుంచో మార్కెట్లో ఉన్న బ్రాండ్ కాబట్టి, బాగా తెలిసిన పేరు కాబట్టి, పెద్దగా స్పెసిఫికేషన్స్ ఇవ్వకుండానే బండి లాక్కొస్తోంది సామ్ సంగ్.మనదేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కేట్లో 28.50 శాతం అమ్మకాలు సామ్ సంగ్ వే.

2) మైక్రోమ్యాక్స్

రెండొవస్థానంలో మన దేశానికే చెందిన మైక్రోమ్యాక్స్ నిలిచింది.మొత్తం మార్కెట్లో దీని అమ్మకాల శాతంమంది 11.90.అయితే మైక్రోమ్యాక్స్ మార్కేట్ పడిపోయే సూచనలే కనిపిస్తున్నాయట.

3) షియోమి (రెడ్ మి, ఎమ్ ఐ)

చాలాతక్కువ కాలంలోనే, మహానగరాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ సంస్థ.ఇదే కంపెనీ నుంచి వచ్చిన రెడ్ మీ నోట్ 3, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ కావడం విశేషం.భారతీయ మార్కెట్లో దీని వాట ప్రస్తుతానికి 8.10%.

4) ఇంటెక్స్

ఇంటెక్స్ అమ్మకాలు టోటల్ మార్కెట్లో 8% శాతం ఉన్నట్లే గాని, చివరి క్వాటర్ కి, ఇప్పటికి ఈ కంపెనీ అమ్మకాలు 4.60% మార్కేట్ ని కోల్పోయింది.

5) లెనోవో

టోటల్ మార్కేట్కో లెనెవో షేర్ 7.20 %.కాని ఈ కంపెనీ అమ్మకాలు కూడా పడిపోవడం గమనార్హం.

6) లావా

లావా ఫోన్ల అమ్మకాలు టోటల్ మార్కెట్లో 5.60 శాతం.

7) ఒప్పో

స్పెషల్ కెమెరా ఫోన్లతో మార్కెట్లోకి దిగిన ఒప్పో యువతను బాగా ఆకట్టుకోని 3.3% మార్కేట్ సంపాదించుకుంది.

8) వివో

ప్రమోషన్స్ భారిగా చేస్తున్న వివో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 2.90%.రోజురోజుకి ఈ సంస్థ పాపులారిటి పెరిగిపోతుంది.

9) ఇక అతికొద్దిమంది రేంజ్ లో ఉండే ఆపిల్, 2.5% అమ్మకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.

* మిగితా మార్కెట్ చిన్నచితకా స్మార్ట్ ఫోన్ కంపెనీలది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube