నీళ్ళు తక్కువగా తాగితే ఎన్ని ప్రమాదాలో!

మానవశరీరంలో 70% నీరే ఉంటుందని సైన్స్ చెబుతోంది.మన రక్తంలో, కండరాల్లో, ఎముకల్లో నీరు ఉంటుంది.

 Less Intake Of Water Will Keep You At Risk Of These Problems-TeluguStop.com

మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉండాలంటే నీరు అత్యవసరం.అందుకే తక్కువ తాగినా, పూర్తిగా నీళ్ళు తాగకుండా ఉండలేం.

రోజుకి 7-8 గ్లాసుల నీరైనా తాగాలి.ఇక నీళ్ళు తక్కువగా తాగితే ఎన్ని ప్రమాదాలో మీరే చూడండి.

* అవసరమైన మోతాదులో నీరు శరీరానికి అందకపోతే బాడి డీహైడ్రేట్ అయిపోతుంది.ఏ పని సరిగా చేయలేరు.మెల్లిమెల్లిగా అనేకరకాల అరోగ్య సమస్యలు వస్తాయి.

* నీరు తక్కువగా తాగితే, శరీరంలో వేడి పెరిగిపోతుంది.

* నీళ్ళు తక్కువగా తాగితే, సాల్ట్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.దాంతో డయబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.అలాగే హార్ట్ రేట్ బ్యాలెన్స్‌ తప్పుతుంది.

* రక్తానికి నీళ్ళు అవసరం.

సరిపడ నీళ్ళు శరీరంలోకి చేరకపోతే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది.

* జీర్ణక్రియకు సహాయపడతుంది నీరు.

నీటి శాతం తగ్గినాకొద్ది జీర్ణక్రియ దెబ్బతింటూ ఉంటుంది.

* నీరు తాగే అలవాటు తగ్గిస్తే అది కడుపులో ఎసిడిటికి, ఆల్సర్ కి కారణమవుతుంది.

* చర్మ సౌందర్యానికి కూడా నీరు ఎంతో అవసరం.నీరు తక్కువగా తాగేవారు ఉన్న వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు.

* శరీరంలోని మలినాలు మూత్రం రూపంలో బయటకి రావాలంటే నీరు అతిముఖ్యం.కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube