దర్శకుడు బాలచందర్‌ కన్నుమూత

తమిళం, తెలుగు, హిందీ, కన్నడంలో వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి, దాదాపు 50 సినిమాలను పైగా నిర్మించిన, మరెన్నో సినిమాలకు రచయితగా వ్యవహరించిన ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌ నిన్న రాత్రి చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలచందర్‌గారి పరిస్థితి రాత్రి విషమించింది.

 Legendary Director K Balachandar Is No More-TeluguStop.com

దాంతో డాక్టర్లు అత్యవసర సేవలు అందించినట్లుగా తెలిసింది.అయినా కూడా బాలచందర్‌ అందరిని విడిచి వెళ్లిపోయారు.

1930 జులై 9న తమిళనాడు తాజాంవూర్‌లో జన్మించాడు బాలచందర్‌.చిన్నప్పటి నుండి కూడా నాటకాలంటే అమితాశక్తి.

స్కూలు రోజుల్లోనే నాటకాల్లోకి ప్రవేశించారు.ఆ తర్వాత సినిమాల్లో రచయితగా ఎంట్రీ ఇచ్చారు.

దర్శకుడిగా మారి ఎన్నో అద్బుత చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు.రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌, ప్రకాజ్‌ రాజ్‌ ఇలా ఎంతో మంది నటీ నటులను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్‌కే దక్కుతుంది.

బాలచందర్‌ తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు కమర్షియల్‌ సక్సెస్‌లుగా నిలవడంతో పాటు పదుల సంఖ్యలో అవార్డులను తెచ్చి పెట్టాయి.పలు జాతీయ అవార్డులను మరియు ఫిల్మ్‌పెయిర్‌ అవార్డులను బాలచందర్‌ దక్కించుకున్నారు.

1987లో పద్మశ్రీ అవార్డు, 1973లో తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం కలైమామణి అవార్డులు సొంతం చేసుకున్నారు.బాలచందర్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.బాలచందర్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.నేడు సాయంత్రం చెన్నైలో బాలచందర్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube