అత్యంత చీప్ ధరకి జియో 4G ఫోన్స్ ... వాటి సూపర్ ఫీచర్లు

4G మార్కెట్ లో మకుటం లేని రారాజుగా వెలుగొందుతోంది జియో.TRAI రిపోర్టు ప్రకారం 20 MBPS సగటు స్పీడుతో, పది మిలియన్లకు పైగా వినియోగదారులతో నెం.1 4G నెట్వర్క్ గా అవతరించింది జియో.మొబైల్ నెట్వర్కింగ్ తరువాత మరో రెండు రంగాలవైపు అడుగులు వేయనుంది జియో.

 Leaked Features Of Jio’s Super Cheap 4g Mobiles-TeluguStop.com

అందులో ఒకటి DTH సర్వీసులు కాగా, మరొకటి 4G మొబైల్ మార్కెట్.ఇప్పటికే LYF పేరుతొ చీప్ రేటుకి 4G ఫోన్లు అందిస్తున్న జియో, వాటికన్నా చీప్ రేటులో, గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా 4G మొబైల్ ఫోన్స్ తీసుకువస్తోంది.

మరి ఆ మొబైల్స్ ఎలా ఉండబోతున్నాయో ఓ లుక్ వెయ్యండి.

జియో 4G ఫోన్లు రెండు వేరియంట్స్ లో రానున్నాయి.ఒకదాని రేటు రూ.1700, మరొకదాని రేటు రూ.1800 నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఏ రెండిటి ఫీచర్స్ అన్ని ఒకేలా ఉండబోతున్నా, కేవలం ప్రాసెసర్ విషయంలో మాత్రం చిన్న తేడా ఉండబోతోంది.

తక్కువ రేటు దాంట్లో స్ప్రెడ్ ట్రం చిప్ వాడుతోంటే, ఎక్కువ రేటు దాంట్లో క్వాల్కం 205 వాడుతున్నారట.రెండు ఇటు LTEని, అటు VoLTE ని సపోర్టు చేస్తాయి.

2.4 ఇంచుల డిస్ప్లే తో 2 MP ఫ్రంట్ కెమెరా, 2MP బ్యాక్ కెమెరాతో ఈ మొబైల్స్ వస్తున్నాయి.RAM 512 MB కాగా, ఇంటర్నల్ స్టోరేజ్ 4GB ఉంటుంది.దీంట్లో మీరు మెమొరి కార్డు కూడా వాడుకోవచ్చు.జియో ప్రీమియం యాప్స్ అయిన జియో సినిమా, జియో మ్యాగజీన్, జియో టివి, ఇతరాత్రా జియో యాప్స్ ఇందులో ఆల్రేడి ఇన్స్టాల్ అయి వస్తాయి.అయితే ఈ యాప్స్ వాడాలంటే మాత్రం మీరు ఫోనులో జియో సిమ్ వాడాలి.

వేరే నెట్వర్క్స్ తో మొబైల్ ని వాడుకోవచ్చు కాని, జియో యాప్స్ ని మాత్రం వాడుకోలేరు.

ఈ రేటుకి, ఇప్పుడు కొత్తగా వచ్చిన నోకియా మొబైల్స్ కూడా ఇలాంటి ఫీచర్స్ ఇవ్వడం లేదు.

ఇక్కడే జియో ప్లాన్ క్లియర్ గా అర్థమయిపోతోంది.గ్రామాల్లో ప్రజలు చాలావరకు రూ.3000 లోపే ఖర్చయ్యే ఫోన్లు వాడుతున్నారు.ఈ కేటగిరిలో షియోమి, ఒప్పో లాంటి బ్రాండ్లు లేవు.

అయితే నోకియా కొంటారు, లేదంటే సామ్సంగ్ కొంటున్నారు.ఈ మార్కెట్ చాలా పెద్దది.

అందుకే జియో మొదట ఈ కేటగిరి కస్టమర్స్ ని టార్గెట్ చేస్తోంది.అంత చీప్ రేటులో 4G ఫోన్ అందిస్తోంది.

దీపావళి సందర్భంగా ఈ మొబైల్స్ మార్కెట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి తక్కువ రేటులో కొత్త మొబైల్ కొనే ప్లాన్ లో ఉంటే కొంచెం వెయిట్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube