తెలుగులో ఎప్పుడొచ్చేనో?

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘గంగ’(ముని`3) సినిమా తెలుగులో విడుదల వాయిదా పడటం జరిగింది.అనుకున్న సమయానికి తమిళంలో విడుదల అయినప్పటికి తెలుగులో నిర్మాత ఆర్థిక ఇబ్బందుల వల్ల సినిమా వాయిదా వేయడం జరిగింది.

 Lawrence’s Ganga Movie Postponed In Telugu-TeluguStop.com

నిన్న తమిళంలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.విమర్శకులు సైతం రాఘవ లారెన్స్‌ నటనకు మరియు దర్శకత్వంకు మంచి మార్కులే వేశారు.

ఇక హీరోయిన్‌లుగా నటించిన తాప్సి మరియు నిత్యామీనన్‌లు మంచి నటన కనబర్చి సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు అంటూ టాక్‌ వినిపిస్తోంది.

తమిళంలో హిట్‌ టాక్‌ రావడంతో ‘గంగ’ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

టాలీవుడ్‌ సినీ వర్గాల్లో సైతం ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది.ఎప్పుడెప్పుడు తెలుగులో గంగ వస్తుందో అని ఎదురు చూస్తున్నారు.

రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కి గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ముని’, ‘కాంచన’ సినిమాలు మంచి సక్సెస్‌ అవ్వడంతో ఈ సినిమాపై ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలను అందుకునేట్లుగా ఈ సినిమా ఉందంటూ తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

తెలుగులో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో, ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube