రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.‘గంగ’ సినిమా చివర్లో ‘ముని`4’ కూడా త్వరలో రాబోతుంది అంటూ ప్రకటించాడు.
తాజాగా తమిళ సినీ వర్గాల్లో ఒక ఆసక్తికర విషయం ఒకటి తెగ ప్రచారం జరుగుతోంది.అదే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించేందుకు ఓకే చెప్పాడట.
కాగా రజినీకాంత్‌తో ‘ముని’ తరహా హర్రర్ సినిమాను చేయాలని లారెన్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయాన్ని రజినీకాంత్‌కు చెప్పగా అందుకు సుచాయిగా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.
పూర్తి కథతో రమ్మని లారెన్స్‌కు రజినీ చెప్పాడట.దాంతో రజినీ కోసం దెయ్యం కథను సిద్దం చేసే పనిలో లారెన్స్ ఉన్నాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రజినీతో లారెన్స్‌కు సినిమా చేసే అవకాశం వస్తే ఆయన దశ తిరిగి పోయినట్లే అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇప్పటి వరకు నవ్వించి, యాక్షన్‌తో ఆకట్టుకున్న రజినీ భయపెడతాడా అనేది చూడాలి.