భర్తకు కొత్త కారు గిఫ్టిచ్చిన లాస్య.. ఖరీదెంతంటే..?

ఒకప్పటి యాంకర్ లాస్య పేరు వినగానే చీమ, ఏనుగు జోక్స్ గుర్తొస్తాయి.ఎందుకంటే తాను ఈ జోకులతో ప్రేక్షకులను బాగా అలరించింది.

 Lasya Car Gift Manju Marriage Anniversary Lasya, Car Gift, Manju, Marriage Anniv-TeluguStop.com

యాంకర్ రవి తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న లాస్య తన పెళ్లి తర్వాత బిజీ లైఫ్ లో గడుపుతుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా లాస్య తన జోకులతో, కొన్ని విషయాలతో తెగ ముందుంటుంది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ 4 సీజన్ లో లాస్య పాల్గొన్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన పని ఏంటో తానే చూసుకునేది.

ఇతరులను ఎక్కువగా నొప్పించకుండా గేమ్ లో బాగా పాల్గొనేది.అంతేకాకుండా తనకు బిగ్ బాస్ వంటలక్క అనే టైటిల్ ను కూడా ఇచ్చాడు.

హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తన చేతి వంట రుచి చూపించేది.కాబట్టి వంటలక్క గా లాస్య గరిట పట్టింది.

Telugu Car Gift, Lasya, Manju, Anniversary-Movie

ఇక లాస్య తన భర్త మంజునాథ్ గురించి, తన ప్రేమ గురించి కొన్నిసార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.తనకు ఓ బాబు ఉండగా తన బాబు అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు అభిమానులతో పంచుకుంది.అయితే ఫిబ్రవరి 15 సోమవారం తన పెళ్లి రోజు సందర్భంగా 16 లక్షల కొత్త కారు మహీంద్రా ఎక్స్ యూవి500 కారును కొనుగోలు చేసింది.తమ పెళ్లి రోజు సందర్భంగా తన భర్తకు కానుకగా ఇచ్చింది.

తమ కొత్త కారు తో దిగిన ఫోటోలు తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.అంతేకాకుండా కొన్ని విషయాలు తెలుపుతూ ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి బహుమతులు ఇస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుందని, మేము ఇప్పుడు ఈ కారులో ఓ రౌండ్ వేసుకొస్తామని తెలిపింది.

అంతేకాకుండా ఏ అనుబంధం లోనూ మంచి రోజులే ఉండవు.తుఫానులా చుట్టేసే కష్టం ఎదురు వచ్చినా సరే గొడుగు కింద ఉండి ఎదుర్కొందాం.

ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది అంటూ రాసుకొచ్చింది.ఇక తమ ప్రేమ గురించి తెలుపుతూ ఓ వీడియోను యూట్యూబ్ లో తన చానల్లో విడుదల చేసింది లాస్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube