జ‌య చివ‌రిగా ఏం చెప్పారు?!

అవును! త‌మిళ‌నాడు సీఎంగా అప్ర‌తిహ‌తంగా చ‌క్రంతిప్పి.అన్నాడీఎంకే పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన పురుచ్చిత‌లైవి జ‌య మ‌ర‌ణానికి ముందు ఏం చెప్పి ఉంటార‌నే విష‌యంపై స‌ర్వ్ర‌తా చ‌ర్చ న‌డుస్తోంది.

 Last Words Of Cm Jayalalithaa-TeluguStop.com

వాస్త‌వానికి జ‌య అపోలో ఆస్ప‌త్రిలో రెండు మాసాలకు పైగా చికిత్స పొందారు.మొద‌టి నెలన్న‌ర పూర్తి స్థాయిలో తీవ్ర అనారోగ్యంలో ఉండిపోయారు.

దీంతో ఆమెతో మాట్లాడేందుకు ఎవ‌రికీ అవ‌కాశం ల‌భించ‌లేదు.కేవ‌లం ఆమెకు వ్యక్తిగ‌త స‌హాయ‌కురాలిగా ఉన్న శ‌శిక‌ళ‌కు మాత్రమే ఆస్ప్ర‌తిలోకి ఎంట్రీ ల‌భించింది.

అదేవిధంగా మ‌రో స‌హాయ‌కురాలిగా ప‌నిమ‌నిషిని నియ‌మించారు.ఇక‌, వైద్యులు మాత్ర‌మే జ‌య‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు.

జ‌య‌కు మ‌రో స‌న్నిహితురాలిగా ఉన్న రాష్ట్ర మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ షీలా న‌ట‌రాజ‌న్ కూడా ఆస్ప‌త్రిలోనే ఉన్నా.ఆమెకు కూడా జ‌య‌ను చూసే అవ‌కాశం ల‌భించ‌లేదు.

ఇక‌, రాష్ట్రంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా అన్నాడీఎంకే అభ్య‌ర్థుల నామిషేన్ ప‌త్రాల‌పై ఆస్ప‌త్రిలో ఉన్న జ‌య నుంచి సంత‌కాలు తీసుకునే బాధ్య‌త‌ను కూడా శ‌శిక‌ళే తీసుకున్న‌ట్టు స‌మాచారం.దీంతో జ‌య‌తో ఎవ‌రైనా మాట్లాడినా.

లేదా జ‌య ఎవరితో నైనా మాట్లాడిన అది ఒక్క శ‌శిక‌ళ‌.లేదా ప‌నిమ‌నిషి.

లేదా డాక్ట‌ర్లు అయి ఉంటార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో శ‌శిక‌ళ‌తోనే ఒక‌టి రెండు మాట‌లు జ‌య మాట్లాడే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం .అయితే, జ‌య ఏం మాట్లాడి ఉంటారు? ఇప్పుడు కోట్ల మంది త‌మిళ ప్ర‌జ‌లు స‌హా అంద‌రూ దృష్టి పెట్టిన విష‌యం ఇదే.త‌నకు ఈ రేంజ్ లో హెల్త్ పాడైపోతుంద‌ని ఊహించ‌ని జ‌య‌.ఇలా జ‌రిగేట‌ప్ప‌టికి.చాలా కుంగిపోయారు.ఈ క్ర‌మంలో త‌న పార్టీని వేరే ఎవ‌రైనా న‌డిపిస్తే బాగుంటుంద‌ని రాజ‌కీయాల గురించి మాట్లాడారా? త‌న‌కున్న ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యంపై మాట్లాడారా? లేక త‌న ఆరోగ్యం గురించే మాట్లాడారా? అస‌లు ఏవిష‌యంపై ఆమె మాట్లాడార‌నే చ‌ర్చ సాగుతోంది.

నిజానికి జ‌య‌కు ఆస్తుల‌క‌న్నా రాజ‌కీయాలంటేనే ప్రాణం.

ఆస్తులు పోయినా.ఆమె ఫీల్ కాలేదు.

ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం, ప‌ద‌విలో ఉండ‌డాన్నే ఇష్ట‌ప‌డ్డారు.దీంతో ఆమె త‌నకు ఆస‌మ‌యంలో ద‌గ్గ‌ర ఉన్న శ‌శిక‌ళ‌తో రాజ‌కీయాల గురించే మాట్లాడి ఉంటార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

అయితే, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.అస‌లు అమ్మ ఏం మాట్లాడి ఉంటుంది అనే విష‌యం తేలాలంటే శ‌శిక‌ళ నోరు విప్పాలి.

అయితే, ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అంటే ఏదైనా పెద్ద అనూహ్య‌మైన ఘ‌ట‌న జ‌రిగితేనే త‌ప్ప అమ్మ ఇలా అన్నారు అని ఆమె చెప్పే అవ‌కాశం లేదు.కాబ‌ట్టి .అమ్మ ఆఖ‌రి మాట‌లపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంద‌న‌డంలో సందేహంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube