జీవన్మరణ సమస్య కాదు

వివాదాస్పద భూసేకరణ బిల్లు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.ప్రతిపక్షాలు దీనిపై పోరాటం చేస్తున్నాయి.

 Land Acquisition Bill Not A Matter Of Life Or Death For Me-TeluguStop.com

ఈ బిల్లు చట్టం కాకుండా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.లోకసభలో ఆమోదం పొందిన ఈ ఆర్డినెన్సు రాజ్యసభలో గట్టెక్కడం కష్టంగా ఉంది.

లోక్‌సభలో పాలక పక్షానికి బండ మెజారిటీ ఉంది కాబట్టి సులభంగా ఆమోదం పొందింది.కాని రాజ్యసభలో ప్రతిపక్షాలదే పైచేయి.

దీంతో మోదీ సర్కారుకు దిక్కుతోచకుండా ఉంది.ఈ బిల్లు చట్టం కాకపోతే ప్రభుత్వం పరువు పోయిందని మీడియా ఊదరగొడుతుంది.

ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటాయి.ఇది కార్పొరేట్‌ అనుకూల బిల్లు అని ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

దీన్నో బలమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి.అయితే ప్రధాని మోదీ మాత్రం దీన్ని లైట్‌ తీసుకుంటున్నట్లు కనబడుతోంది.‘ఇది నాకు జీవన్మరణ సమస్య కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఇది తమ ప్రభుత్వ, పార్టీ ఎజెండాలోనూ లేదన్నారు.

రాజ్యసభలో ఈ బిల్లు నెగ్గితే మాత్రమే చట్టంగా మారుతుంది.అందుకే ఆ నమ్మకం లేకనే మోదీ ఇలాంటివ వ్యాఖ్యలు చేశారా అనిపిపిస్తోంది.

నిజానికి ఈ బిల్లు కారణంగా రైతులకు, భూములున్నవారికి తీవ్ర నష్టం కలుగుతుంది.ప్రజల కనీస హక్కులకు భంగం వాటిల్లుతుంది.

తాను పేదల పక్షపాతినని చెప్పుకుంటున్న మోదీ ఇలాంటి బిల్లును ఎందుకు చట్టం చేయాలనకుంటున్నారో అర్థం కావడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube