బీహార్లో మోడీ మైండ్ గేమ్

రాజకీయాల్లో సామ, దాన, భేద, దండోపాయం .అని నాలుగు మార్గాలు ఉన్నాయి.

 Lalu Will ‘remote Control’ Bihar If Grand Alliance Elected-TeluguStop.com

ఇద్దరి మధ్య విభేదాలు కల్పించే విద్యను ఇప్పుడు మైండ్ గేమ్ అంటున్నారు.అనుమానాలు కలిగించే తీరుగా ప్రచారం చేస్తే కలిసి ఉన్నవారి మధ్య విభేదాలు వచ్చి విడిపోతారని అంచనా.

రాజకీయ నాయకులు చాలా మంది ఈ పని చేస్తారు.బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనే చేస్తున్నారు.

ఇక్కడ గ్రాండ్ అలయన్స్ పేరుతో లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయు, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి.ఈ కూటమిని విడగొట్టాలని భాజపా ప్రయత్నాలు చేస్తోంది.

ఒకవేళ ఎన్నికల్లో గ్రాండ్ అలయన్స్ గెలిచి అధికారంలోకి వస్తే లాలూ ప్రసాద్ యాదవ్ రిమోట్ కంట్రోల్ మాదిరిగా ఉంటారని మోడీ అన్నారు.అంటే లాలూ చక్రం తిప్పుతారన్న మాట.లాలూ నిన్ను కేర్ చేయడని నితీష్ కుమార్ను మోడీ హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వాన్ని బయటి నుంచి కంట్రోల్ చేయడానికే లాలూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మోడీ అన్నారు.

గ్రాండ్ అలయన్సు అధికారంలోకి వస్తే లాలూ ఎలాంటి పాత్ర పోషిస్తారో చెప్పలేం.కానీ మోడీ భయపెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube