Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కేశినేనికి బాబు చెక్‌: ల‌గ‌డ‌పాటికి విజ‌య‌వాడ ఎంపీ సీటు-Lagadapati Rajagopal Met CM Chandrababu

విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)కి ఏపీ సీఎం చంద్ర‌బాబు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా ? ఇటీవ‌ల పార్టీపై బాహాటంగానే త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తోన్న నానిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్ట‌నున్నారా ? కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్‌కు చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇచ్చే యోచ‌న‌లో ఉన్నారా ? అంటే తాజా ప‌రిణామాలతో అవున‌నే గుస‌గుస‌లు విజ‌య‌వాడ‌లో వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరు సుమారు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జర‌ప‌డం ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. చంద్ర‌బాబుతో భేటీ త‌ర్వాత ల‌గ‌డ‌పాటి ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేశారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యం సూప‌ర్‌గా ఉందంటూ కితాబిచ్చారు.

Continue Reading
More Posts
To Top