జగన్ అవినీతి కి పాల్పడలేదు - కేవీపీ క్లీన్ చిట్

కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా హ‌ఠాత్తుగా ఎదిగిన కెవిపి రామ‌చంద్ర‌రావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న‌ట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి.ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేవీపి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌కి అత్యంత స‌న్నిహితుడుగానే కాకుండా ప్రభుత్వ సలహాదారు గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

 Kvp Clean Chit To Jagan-TeluguStop.com

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో త‌ల‌లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం విదిత‌మే.రాష్ట్ర విభ‌జ‌న వ్య‌తిరేకిస్తునే సోనియాకు మ‌ద్ద‌తు తెల‌ప‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు చాలానే వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోరుతూ అనేక ప‌ర్యాయాలు స‌భ‌లో ప్ర‌సంగించారు.ఫ‌లితం శూన్యం కావ‌టంతో హోదా మా హ‌క్కు అంటూ ప్ర‌యివేటు బిల్లు ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే….

కాగా గ‌తంలో వైఎస్ కు ఆత్మ‌గా వ్య‌వ‌హ‌రించిన కేవీపీకి రాను రానూ కాంగ్రెస్ నుంచి మ‌ద్ద‌తు త‌గ్గిపోవ‌టంతో త‌న మిత్రుడి త‌నయుడి పార్టీలో చేరిపోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు క‌నిపిస్తోంది.జగన్ నా మేనల్లుడు , అతను లేకుండా తానెలా ఉంటానంటూ ఓ టివి ఇంట‌ర్వూలో చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు ప‌రాకాష్ట అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మ‌రో అడుగు ముందుకు వేసి జ‌గ‌న్‌పై వ‌చ్చిన వ‌న్నీ అర్దం లేని ఆరోపణలు అని తేల్చి చెప్పిన కేవీపీ… జగన్ ఎలాంటి అవినీతి కి పాల్పడలేదని క్లీన్ చిట్ ఇస్తూ, వైఎస్ హయాంలో జ‌గ‌న్ ఎలాంటి లబ్ది పొందలేదని , వ‌చ్చిన ఆరోప‌ణ‌లు కోర్టులో రుజువు కాలేనివ‌ని వ్యాఖ్యానించారు.

కేవీపీ తాజా వ్యాఖ్యల నేపద్యంలో కాంగ్రెస్‌ను వీడి వైకాపా తీర్ధం తీసుకోవ‌చ్చ‌న్న వాద‌నల‌కు ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube