అభిమానం అనేది ఎదైనా చేయిస్తుంది.దీనికి సినిమాతారలు కూడా మినహాయింపు కాదు.
ఈ విషయానికి తాజా ఉదాహరణగా మన కుమారి హీబా పటేల్ ను చెప్పుకోవచ్చు.అలా ఎలా తో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ కుమారి 21F తో సూపర్ సక్సెస్ అందుకుంది.
హీబా వయసు 21, ముంబాయిలో పుట్టి పెరిగింది.ఈ మరాఠీ ముద్దుగుమ్మ కి మహేష్ బాబు అంటే వెర్రి అభిమానం అంట.మహేష్ సినిమాలు తెగ చూడటం అలవాటు అంట.శ్రీమంతుడు చూసిన తరువాత ఈ పిచ్చి మరింత పెరిగిందట.కేవలం ఒక అభిమాన హీరోగా కాకుండా, ఒక వ్యక్తిగా కూడ మహేష్ అంటే చాలా ఇష్టం అంటోంది హీబా.
మహేష్ తో ఎప్పటికైనా నటించాలనేది తన కల అని చెప్పిన హీబా, బికిని వేస్తారా అని అడిగిన ఒక ప్రశ్నకు, మహేష్ బాబు హీరో అయితేనే వేస్తానని, మహేష్ జెమ్స్ బాండ్ గా చేస్తే, బాండ్ గర్ల్ గా నటిస్తానని చెప్పింది హీబా.
ఇక కుమారి సక్సెస్ తరువాత హీబా అవకాశాలు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయట.అదే ఊపులో సూపర్ స్టార్ తో కూడా ఒక అవకాశం వస్తే బాగుండు.