2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ సీఎం కేసీఆర్ త‌న పొలిటిక‌ల్ వార‌సుడిని డిసైడ్ చేశారా? త‌న త‌ర్వాత పార్టీని న‌డిపించి, ప్ర‌భుత్వాన్ని గెలిపించుకునే స‌త్తా ఉన్న నేత‌ను ప‌ట్టుకున్నారా? 2019 ఎన్నిక‌ల్లో ఆ నేత‌కే పార్టీ ప‌గ్గాలు స‌హా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే ఛాన్స్ కూడా ఇవ్వ‌నున్నారా? అంటే.ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది టీఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి.

 Ktr Will Become Telangana Chief Minister In 2019?-TeluguStop.com

సీఎం కేసీఆర్ త‌న వార‌సుడిని ఎంచుకున్నార‌ని వారు చెబుతున్నారు.వాస్త‌వానికి కేసీఆర్ వార‌స‌త్వంపై గ‌త కొన్నాళ్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

కేసీఆర్ త‌న వార‌స‌త్వాన్ని.మేన‌ల్లుడు హ‌రీష్‌రావుకి, లేదా కుమారుడు కేటీఆర్‌కి ఇస్తార‌ని కొంద‌రంటే.

కాదు కాదు.ఈ రేసులో నిజామాబాద్ ఎంపీ క‌విత కూడా ఉంద‌ని చెబుతూ వ‌చ్చారు.

నిజానికి పైన పేర్కొన్న ముగ్గురు కూడా తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఎంతో చ‌లాకీగా వ్యూహాలు ర‌చిస్తూ.ప్ర‌జ‌ల‌ను ఏక‌తాటిపైకి తెచ్చారు.

కేవ‌లం తెలంగాణ‌లోని గ్రామాల‌కే ప‌రిమిత‌మైన బ‌తుక‌మ్మ‌ను ప్ర‌పంచ ప్ర‌ఖాతం చేయ‌డం స‌హా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కేలా చేయ‌డంలో క‌విత స‌మ‌ర్థ‌త మ‌న క‌ళ్ల‌కు క‌డుతుంది.అదేవిధంగా గ్రామాల అభివృద్ధిలోనూ ఆమె ముందుంటోంది.

తెలంగాణ జాగృతి పేరుతో ఆమె చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాయి.అదేవిధంగా హ‌రీష్ రావు కూడా ఉద్య‌మం స‌మ‌యంలో ఎంతో శ్ర‌మకోర్చారు.

ప్ర‌స్తుతం మంత్రిగా కూడా ఆయ‌న రాష్ట్రంలో ప్రాజెక్టుల విష‌యంలో ఎంతో దూర‌దృష్టితో అడుగులు వేస్తున్నారు.

ఇక‌, సీఎం కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటూనే ఉన్నారు.

ఉద్య‌మం స‌మ‌యంలోనే కాకుండా ప్ర‌స్తుతం మంత్రిగా కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రం పెట్టుబ‌డుల విష‌యంలో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉందంటే.

దీని వెనుక కేటీఆర్ కృషి ఉంద‌ని వేరేగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు.దీంతో టీఆర్ ఎస్‌కి వీరిముగ్గురిలో ఎవ‌రో ఒక‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని అంద‌రూ భావించారు.

దీనికి ముగింపు ప‌లుకుతున్న‌ట్టుగా సీఎం కేసీఆర్ ఇటీవల ప‌రోక్షంగా త‌న వార‌సుడిని ప్ర‌క‌టించార‌ని అంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు.

రాష్ట్ర మంత్రివ‌ర్గం పని తీరుపై సీఎం కేసీఆర్ జరిపిన రివ్యూలో కేటీఆర్ పని చేసే పరిశ్రమల శాఖకే ఎక్కువ మార్కులు వేశారని స‌మాచారం.

టీఎస్ ఐపాస్ పేరుతొ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రవేశపెట్టిన తరువాత 2500 పరిశ్రమలు వచ్చాయని లెక్కలు కూడా చెప్పారు.బాగా పని చేస్తున్నావంటూ కొడుకును భుజం తట్టి ప్రోత్సహించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడాతెరాస విజయం సాధించడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని అందరికీ తెలిసిందే.దీంతో 2019 ఎన్నికల్లో కేటీఆర్ ను ముందు పెట్టి కేసీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సో.టీఆర్ ఎస్ భ‌విష్య‌త్ బాస్ ఎవ‌రో తెలిసిపోయిన‌ట్టేగా!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube