సెటిల‌ర్స్ కాన్‌స్టెన్సీపై కేటీఆర్ క‌న్ను..!

తెలంగాణ‌లో టీడీపీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.గ‌త ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో క‌లిసి మెజార్టీ సీట్లు గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు పార్టీ ఉందా ? అన్న సందేహాలు వ‌చ్చే స్థితికి దిగ‌జారిపోయింది.ఇదిలా ఉంటే ఇక్క‌డ ఆంధ్రా సెటిల‌ర్ల‌తో పాటు నార్త్ ఇండియ‌న్స్‌కు చెందిన సెటిల‌ర్లు ఎక్కువుగా ఉన్నారు.వీరిలో ఇప్ప‌ట‌కీ టీడీపీకి కాస్తో కూస్తో ప‌ట్టుంది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరంతా టీఆర్ఎస్ వైపు ఉండేలా మంత్రి కేటీఆర్ స‌రికొత్త స్కెచ్‌కు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది.

 Ktr To Contest From Hyderabad-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సెటిల‌ర్లు ఎక్కువుగా ఉన్న గ్రేట‌ర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌న్న వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి.

కేటీఆర్ క‌న్ను ఖైర‌తాబాద్ మీద ఉంద‌ని ముందు వార్త‌లు వ‌చ్చాయి.అయితే ఇప్పుడు మ‌రో టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కేటీఆర్ సెటిల‌ర్లు ఎక్కువుగా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి లేదా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో కేటీఆర్ ఎక్క‌డో ఓ చోట నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

కేటీఆర్ గ‌త మూడుసార్లుగా క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు.

మంత్రిగా తెలంగాణ‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో పాటు విదేశాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌తో బిజీగా ఉండ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై కాన్‌సంట్రేష‌న్ త‌గ్గించార‌న్న టాక్ వ‌స్తోంది.ఇక ఆయ‌న ఎక్కువుగా హైద‌రాబాద్‌లోనే ఉండాల్సి వ‌స్తోంది.

సిరిసిల్ల‌లో కేటీఆర్ త‌ర్వాత బాధ్య‌త‌లు చూసే మ‌రో నేత ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం కూడా ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఆయ‌న హైద‌రాబాద్‌లో గ‌ల్లీ గ‌ల్లీ తిరిగారు.

కేటీఆర్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ డ‌వ‌ల‌ప్‌మెంట్‌పై స్పెష‌ల్ కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇక్క‌డ నుంచే పోటీ చేసేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇక్క‌డ సెటిల‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ల‌తో ఆయ‌న త‌ర‌చూ ట‌చ్‌లో ఉంటున్నార‌ని.ఇదంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకే అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube