ఇదీ కేటీఆర్‌ 'వేదం'

రాజకీయ నాయకులు ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అంటూ ఉంటారు.దయ్యాలు క్షుద్రమైనవి.

 Ktr Helped 1 Lakh Rupees To Nagaiah-TeluguStop.com

వేదాలు పవిత్రమైనవి అని అర్థం.కొందరు తమ విధానం ఇదీ అని చెప్పాలనుకున్నప్పుడు ‘ఇదే నా వేదం’ అంటారు.

టాలీవుడ్‌ ఆశ్చర్యపోయిన ఓ సంఘటన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‘వేదం’ ఏమిటో తెలియచెప్పింది.సాయం చేయడం ఆయన వేదం అని ఈ ఘటన నిరూపించింది.

హిట్‌ సినిమా ‘వేదం’లో ‘సిరిసిల్ల రాములు’ పాత్ర హృదయం ద్రవింప చేస్తుంది.సినిమా చూసిన వారికి ఈ సంగతి తెలుసు.

సిరిసిల్ల రాములు పాత్రలో అద్భుతంగా నటించిన వ్యక్త నాగయ్య.వాస్తవానికి అతను నటుడు కాదు.

కాని పాత్రను అద్భుతంగా పోషించి కళ్ల నీరు తెప్పించాడు.ఇలాంటి వ్యక్తి హైదరాబాద్‌ రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నాడు.

రొట్టె కొనుక్కునేందుకు కూడా డబ్బు లేదు.ఆయనకు వేషాలు లేకపోవడమే ఇందుకు కారణం.

నాగయ్య సంగతి తెలుసుకున్న కేటీఆర్‌ ఆయనకు తన వంతుగా లక్ష రూపాయల సాయం చేశారు.ప్ర భుత్వం తరపున వృద్ధ కళాకారుల పెన్షన్‌ కూడా మంజూరు చేశారు.‘మా’ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌తోనూ మాట్లాడి సాయం చేయాలని చెప్పారు.కేటీఆర్‌ ఉదార గుణానికి మోహన్‌ బాబు కూతురు మంచు లక్ష్మి మురిసిపోయింది.‘హ్యాట్సాఫ్‌ రామ్‌’ అంటూ ప్రశంసల జల్లు కురిపించింది.ఇంతకూ నాగయ్య తెలంగాణవాడా? కాదు…ఆయనది గుంటూరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube