2018లో తెలంగాణ సీఎంగా కేటీఆర్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల కంటే ముందుగానే కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకుని త‌న కుమారుడు కేటీఆర్‌ను తెలంగాణ సీఎంగా చేయ‌నున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి.ప్ర‌త్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ ప‌దిహేనేళ్ల పాటు ఫైట్ చేసి చివ‌ర‌కు ప్ర‌త్యేక తెలంగాణ‌ను సాధించుకున్నారు.

 Ktr As Telangana Cm In 2018-TeluguStop.com

తెలంగాణ ఏర్ప‌డిన వెంట‌నే జ‌రిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజ‌యం సాధించ‌డంతో కేసీఆరే ఫ‌స్ట్ సీఎం అయ్యారు.ఇప్ప‌టికే కేసీఆర్‌కు వ‌య‌స్సు పైబ‌డ‌డంతో గ‌తంలో అంత యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నారు.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ త‌న వార‌సుడిగా కేటీఆర్‌కు ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని క‌స‌ర‌త్తులు ప్రారంభించేశార‌ని తెలుస్తోంది.ఈ డిసెంబ‌ర్ నెలాఖ‌రులో కేసీఆర్ త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని… వ‌చ్చే సంక్రాంతికి తెలంగాణ సీఎం పీఠంపై కేటీఆరే ఉంటార‌ని కూడా టీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.2019 ఎన్నిక‌ల ర‌థ‌సార‌థిగా కేటీఆర్ దూసుకుపోతున్నారు.ఆయ‌న ఇప్పటికే పెద్దపల్లి, తాండూరు, కొల్లాపూర్‌ సభల్లో పాల్గొనగా.

గురువారం ఆర్మూరు సభలో పాల్గొన్నారు.ఇవ‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి.

ఇక ఆర్మూర్ స‌భ‌లో అయితే కేటీఆర్ త‌న సోద‌రి, నిజామాబాద్ ఎంపీ క‌విత‌తో క‌లిసి పాల్గొన్నారు.ఈ స‌భ‌లో క‌విత‌తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీఎస్ త‌దితరులు కూడా కేసీఆర్‌ రాజకీయ వారసుడు కేటీఆరేనన్న రీతిలో ప్రసంగించారు.

చివ‌ర‌కు కేటీఆర్ కూడా మీ అంద‌రి ఆశీర్వాదాలు త‌న‌కు కావాల‌న్నారు.

ఇక రోజు రోజుకు కేటీఆర్‌కు పోటీ అని ముందుగా ప్ర‌చారంలో ఉన్న కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీష్‌రావు ప్రాధాన్య‌త త‌గ్గిపోతోంది.

ఇక కేసీఆర్ వార‌సుడిగా కేటీఆర్‌కు దాదాపు లైన్ క్లీయ‌ర్ అయిన‌ట్టే స్ప‌ష్ట‌మ‌వుతోంది.ఇక కేటీఆర్‌ను సీఎం చేశాక కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో టీఆర్ఎస్ ముద్ర బ‌లంగా ఉండేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తార‌ని స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube