Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

2018లో తెలంగాణ సీఎంగా కేటీఆర్‌..!-KTR As Telangana CM In 2018

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల కంటే ముందుగానే కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకుని త‌న కుమారుడు కేటీఆర్‌ను తెలంగాణ సీఎంగా చేయ‌నున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌త్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ ప‌దిహేనేళ్ల పాటు ఫైట్ చేసి చివ‌ర‌కు ప్ర‌త్యేక తెలంగాణ‌ను సాధించుకున్నారు.

తెలంగాణ ఏర్ప‌డిన వెంట‌నే జ‌రిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజ‌యం సాధించ‌డంతో కేసీఆరే ఫ‌స్ట్ సీఎం అయ్యారు. ఇప్ప‌టికే కేసీఆర్‌కు వ‌య‌స్సు పైబ‌డ‌డంతో గ‌తంలో అంత యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ త‌న వార‌సుడిగా కేటీఆర్‌కు ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే కేటీఆర్‌ను సీఎం చేయాల‌ని క‌స‌ర‌త్తులు ప్రారంభించేశార‌ని తెలుస్తోంది.

Continue Reading
More Posts
To Top