కృష్ణమ్మ.. ఇంకెప్పుడు వచ్చేను?

సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీర్‌బాబు ‘ప్రేమ కథా చిత్రమ్‌’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.ఈయన తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’.

 Krishnamma Kalipindi Iddarini Release Postponed Again-TeluguStop.com

‘ప్రేమ కథా చిత్రమ్‌’లో తనతో రొమాన్స్‌ చేసిన నందితతో మరోసారి ఈ సినిమాలో కలిసి నటించాడు.చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినప్పటికి సరైన సమయం కోసం ఎదురు చూస్తు విడుదలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.

మొదట అనుకున్న దాని ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల చేయాల్సి ఉంది.కాని ఆ సమయంలో పెద్ద సినిమాలు ఉండటంతో విడుదల నిలిపేశారు.

ఆ తర్వాత కూడా విడుదల అనుకున్న ప్రతి సారి కూడా ఏదో ఒక పెద్ద సినిమా విడుదలకు సిద్దం అవుతుండటంతో చేసేది లేక వాయిదాలు వేస్తూ వస్తున్నారు.ఈ సినిమాలో రానా మరియు నాగచైతన్యలు ముఖ్య పాత్రల్లో కనిపించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరి ఎప్పుడు ఈ సినిమాకు సేఫ్‌ జోన్‌ దొరికేనో, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube