ఎన్టీఆర్ తో లవ్ స్టోరి తీస్తాడట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మనకి గుర్తొచ్చేది ఆదిలో తొడగొట్టే సీన్, లేదా సింహాద్రిలో విలన్లను నరికే సీన్, లేదంటే యమదొంగలో మోహన్ బాబుకి ఛాలెంజ్ చేసే సీన్.మరి ఇలాంటి మాస్ ఎన్టీఆర్ ని క్లాస్ గా చూపించి సుకుమార్ ఒక ప్రయత్నం చేస్తే, పూర్తిగా లవర్ బాయ్ గా మార్చేస్తా అంటున్నాడు ఓ కుర్ర దర్శకుడు.

 Hanu Raghavapudi Cooking A Love Story For Ntr-TeluguStop.com

ఆ దర్శకుడే హను రాఘవపూడి.

అందాల రాక్షసి వంటి వైవిధ్యమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ దర్శకుడు, ఇటివలే నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ రూపిందించి ఫర్వాలేదనిపించే సక్సెస్ ని సాధించాడు.

ఈ దర్శకుడి తదుపరి టార్గెట్ ఎన్టీఆర్.ఇటివలే ఎన్టీఆర్ ని కలిసి ఒక లైన్ చెప్పాడట.

అసలు ఇలాంటి లవ్ స్టోరిని ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఒప్పుకుంటాడా అని మొదట సంశయించినా, ఎన్టీఆర్‌ ఒకే అనడంతో ఆశ్చర్యపోయాడట.

కాకపోతే ఇంకా పూర్తి కథ సిద్ధం కాలేదు.

బాండ్ స్క్రిప్టుతో మెప్పిస్తేనే ఎన్టీఆర్ అవకాశమిస్తాడు.మరి ఒక ప్రేమకథలో మనం ఎన్టీఆర్‌ చూస్తామా లేదా అనేది హను రచన మీదే ఆధారిపడి ఉంది.

ఒకవేళ ఒకే అయితే మాత్రం .ఎన్టీఆర్‌ చేయలేని పాత్ర అంటూ ఏది ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube