అబ్బాయి లుక్‌పై మహేష్‌ ట్వీట్‌

విజయనిర్మల తనయుడు నరేష్‌ వారసుడు అయిన నవీన్‌ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’.ఈ సినిమాతో తెరంగేట్రం ఇవ్వబోతున్న నవీన్‌ కృష్ణ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి పెద్దగా తెలిసింది లేదు.

 Mahesh Babu Tweets For Naresh Son-TeluguStop.com

సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి, త్వరలో విడుదల కూడా కాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరియు విజయనిర్మలలు కలిసి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది.ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం గ్రాండ్‌గా చేసినా కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ రాలేదు.

‘ఐనా ఇష్టం నువ్వు’ ఫస్ట్‌లుక్‌పై మహేష్‌బాబు స్పందించడంతో ఒక్కసారిగా సినిమాకు భారీ క్రేజ్‌ వచ్చింది.అన్న కొడుకు నవీన్‌ కృష్ణను అభినందిస్తూ మహేష్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లింది.

బాబాయి ట్వీట్‌తో అబ్బాయి సినిమాకు మంచి బిజినెస్‌ కూడా అయ్యే అవకాశాలున్నాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.సినిమా లుక్‌ బాగుంది, నవీన్‌కు మరియు ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ మహేష్‌బాబు ట్వీట్‌ చేశాడు.

మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు మహేష్‌ను తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube