ఇంతకీ కొరటాల ఎవరి వైపు

సక్సెస్ ఎవరి దగ్గర ఉంటే వారివైపే చూస్తుంది ప్రపంచం.అది ఏ రంగమైనా.

 Who Is Koratala Siva’s Next Hero ?-TeluguStop.com

రచయితగా కెరీర్ మొదలుపెట్టి, చాలా సక్సెఫుల్ కథలు అందించారు కొరటాల శివ, భద్ర,సింహ,బృందావనం కేవలం ఆయన రచనా శక్తి కి మచ్చు తునకలు.ఆయన పేరు ఆశించకుండా ఇంకెన్నో చిత్రాలకి రచనా సహకారం అందించారు.

ఈ కష్టజీవి కి అదృష్టం కొద్ది మొదటి చిత్రమే ప్రభాస్ లాంటి కథానాయకుడితో చేసే అవకాశం దొరికింది.దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న కొరటాల , కేవలం తన కెరీర్ కే కాదు, ప్రభాస్ కెరీర్ కి కుడా అంతులేని బలాన్ని చేకూర్చారు.

ఇక రెండో సినిమా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో.అయినా ఒత్తిడికి తావు ఇవ్వకుండా, ద్వితీయా చిత్రాన్ని దిగ్విజయంగా పూర్తీ చేసారు.ఫలితం, శ్రీమంతుడు బ్లాక్బస్టర్.అలంటి ఇలాంటి బ్లాక్బస్టర్ కాదు ….అదో రకం.

ఇప్పుడు అవకాశాలే కొరటాల దగ్గరికి వెళ్తున్నాయి.కొరటాల తదుపరి సినిమా ఎవరితో ? చిరంజీవి అని ఒకరు అంటే, ఎన్టీఆర్ తో అని ఇంకొకరు.కాదు కాదు అఖిల్ తో అని ఇంకొందరు.

ఇంతకీ కొరటాల మనసులో ఎవరున్నారు ? కొరటాల కలం ఎవరి కోసం కథ రాస్తోంది ? కాలమే సమాధానం చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube