పది బ్లాక్ బస్టర్స్ ఇస్తా ఇదే ఛాలెంజ్ : కొరటాల శివ

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మూడు సినిమాలతో దర్శకుడిగా టాప్ రేంజ్ కు వెళ్లిన కొరటాల శివ జనతా సక్సెస్ తో తనలోని కాన్ఫిడెన్స్ రెట్టింపయ్యింది అనుకుంటా అందుకే కెరియర్ మొత్తం మీద పది బ్లాక్ బస్టర్స్ ఇస్తానని దానికి తగ్గ కథలు తన దగ్గరున్నాయని ఛాలెంజ్ చేస్తున్నాడు.ఇప్పటికే చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అందుకున్న కొరటాల శివ ఇక చేయబోయే మిగతా 7 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యేట్టుగానే కృషి చేస్తానని అన్నారు.

 Koratala Siva Planning Ten Blockbusters For Tollywood-TeluguStop.com

మూడు సినిమాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా అవి వచ్చే సినిమాల్లో లేకుండా చూస్తానని అన్నారు.

ఇక తనకు దొరికే నిర్మాతలు కూడా చాలా మంచి మనుషులని.

చేసిన మూడు సినిమాల్లో రెండు బ్యానర్లను పరిచయం చేయడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు.ఇక జనతా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కొరటాల శివ తన తర్వాత సినిమా మహేష్ బాబుతో చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ సినిమా చేస్తున్నాడు ఆ మూవీ కంప్లీట్ కాగానే మహేష్ మరోసారి కొరటాల శివతో కలిసి సినిమా చేస్తున్నాడు.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుందీ.

సో కొరటాల లెక్క ప్రకారం మహేష్ తో తీసే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అన్నట్టే మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube