మొదటి సినిమా ‘మిర్చి’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 7న ఆ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాపై గత కొన్ని రోజులుగా అనేక రకాల ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.మొదట ఎన్టీఆర్తో కొరటాల శివ ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని, వీరిద్దరి మధ్య కథా చర్చలు సైతం కూడా జరిగాయంటూ వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ ఇటీవలే సుకుమార్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పడంతో మెగా హీరోతో కొరటాల కమిట్ అయ్యాడని వార్తలు పుట్టుకు వచ్చాయి.మెగా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో జత కట్టేందుకు ఓకే చెప్పాడని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది.
అయితే తాజాగా కొరటాల శివ తన తర్వాత సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కొరటాల మాట్లాడుతూ.
ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ఈ సినిమాపైనే ఉందని, ఈ సినిమా విడుదలైన తర్వాత మరే సినిమా గురించి అయినా ఆలోచన చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.ఇక తన తర్వాత సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
దాంతో ఎన్టీఆర్, బన్నీలలో ఎవరితో సినిమా లేదని కన్ఫర్మ్ అయ్యింది.