రూమర్స్ ఖండించిన కొరటాల శివ

మహేష్ బాబు – బాలకృష్ణ ఓకే సినిమాలో అనే రూమర్ ఇలా రాగానే తెగ సంబరపడిపోయారు నందుమూరి, ఘట్టమనేని అభిమానులు.అందులోనూ కొరటాల శివ డైరెక్టర్ అన్నారు.

 Koratala Responds On Mahesh – Balakrishna Film-TeluguStop.com

మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ కి బాలయ్య బాబు మాస్ ఫాలోయింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు మిగలవు అని తెగ ముచ్చటిపడిపోయారు.ఇంతలోనే అసలు విషయం బయటపడి, వారి ఆశలపై, అంచనాలపై నీళ్ళు చల్లింది.

మహేష్ బాబు – బాలకృష్ణ మల్టిస్టారర్ లో నటించట్లేదు.ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ ఖండిచారు.

అసలు తన తదుపరి చిత్రం మల్టిస్టారర్ కాదని, ఎలాంటి క్రేజీ కాంబినేషన్స్ లేవని, వస్తున్న రూమర్లను పట్టించుకోవద్దని తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు కొరటాల.సో, మహేష్ – కొరటాల తప్ప, మరో పెద్ద పేరు ఉండదన్నమాట సినిమాలో.

ఇక డి.వి.వి.దానయ్య నిర్మించే ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తాడనే రూమర్ కూడా ఉంది.పాత్ర సంగతి పూర్తిగా తెలియదు కాని, ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలవుతుంది.అంతా అనుకున్నట్లుగా జరిగితే, వచ్చే దసరాకి బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube