మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ సాధించి, రెండో సినిమాతోనే రికార్డులు తిరగరాసి, మూడో సినిమాతో సక్సెస్ ని కంటిన్యూ చేసిన ఘనపాటి కొరటాల శివ.కథ విషయంలోనే కాదు, ఆర్టిస్టుల ఎంపికలో కూడా కొరటాల ఖచ్చితత్వంతో మెదులుతారు కాబట్టి 100% సక్సెస్ రేటు ఉంది.
ఇక ఈ దర్శకుడు చేయబోయే తదుపరి సినిమా ఏంటో తెలుసుగా.సూపర్ స్టార్ మహేష్ ని “భరత్ అనే నేను” చిత్రంలో ముఖ్యమంత్రిగా చూపించనున్నారు కొరటాల.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కథానాయిక కోసం వెతుకుతున్నారు.
కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని కొరటాల భావిస్తున్నారట.కీర్తి సురేష్ పేరుని పరిశీలిస్తున్నారని వార్తలొస్తున్నాయి కాని అందులో నిజమెంతో తెలియదు.
ఇప్పుడైతే కొరటాల ఆండ్ టీమ్ కంప్యూటర్ ముందు కూర్చోని ప్రోఫైల్స్ పంపించిన మోడల్స్ ఫోటోలను తెగ చూసేస్తున్నారట.మహేష్ లాంటి అందగాడి పక్కన ఏ అమ్మాయి సెట్ అవుతుంది, నటనలో పోటి కాకపోయినా, ఫర్వాలేదనిపించే టాలెంట్ ఎవరిలో ఉంది అని ఆడిషన్స్ చేస్తున్నారట.
ఈ ప్రాసెస్ లో ఎవరైనా మంచి అమ్మాయి తగిలితే కొత్త హీరోయినే ఉండోచ్చు.ఇక ఎవరు తగలక, సమయం దగ్గరపడితే మాత్రం ఉన్న హీరోయిన్స్ లోనే మళ్ళీ ఎవరినైనా తీసుకుంటారన్నమాట.