కమెడియన్‌ కొండవలస ఇకలేరు

ప్రముఖ తెలుగు కమెడియన్‌ కొండవలస లక్ష్మణరావు నిన్న రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌లో 9 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.చెవికి సంబంధించిన వ్యాదితో గత కొంత కాలంగా కొండవల ఇబ్బంది పడుతున్నారు.అది తీవ్రతరం అవ్వడంతో కొండవలస మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.2002లో ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ చిత్రంతో కమెడియన్‌గా పరిచయం అయిన కొండవలస ఎన్నో చిత్రాల్లో నటించి, నవ్వించారు.పలు అవార్డులు, రివార్డులను ఈయన అందుకున్నారు.

 Kondavalasa Lakshmana Rao Died-TeluguStop.com

సినిమాల్లోకి రాక ముందు దాదాపు వెయ్యి నాటక ప్రదర్శణలు ఇచ్చిన కొండవలస రెండు నంది అవార్డులను కూడా దక్కించుకున్నారు.విశాఖ పోర్టులో జాబ్‌ చేసే కొండవలసను దర్శకుడు వంశీ సినిమాల్లోకి తీసుకు వచ్చాడు.శ్రీకాకులం జిల్లాలోని కొండవలసలో అగస్టు 10, 1946లో ఈయన జన్మించారు.

కొండవలస మృతితో ఆయన కుటుంబంతో పాటు సినిమా పరిశ్రమ శోఖ సంద్రంలో మునిగింది.ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

నేడు ఉదయం ఆయన పార్థీవ దేహాన్ని ఫిల్మ్‌ నగర్‌కు తీసుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube