కొండా దంప‌తుల‌కు బ‌య‌ట‌కు పంపించేస్తున్నారా..!

వ‌రంగ‌ల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి.ఇక్క‌డ బ‌ద్ధ విరోధ‌లంద‌రిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు వారి మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర్చ‌లేక చేతులెత్తేస్తున్నారు.

 Konda Family Ends Up In Trs-TeluguStop.com

ఆ ముగ్గురు బ‌ద్ధ శ‌త్రువులు ఎవ‌రో కాదు మంత్రి క‌డియం శ్రీహ‌రి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు.వీరి ముగ్గురికి ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు ప‌డ‌దు.

టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి శ‌త్రువులుగా ఉన్న క‌డియం, ఎర్ర‌బెల్లి ఇప్పుడు అంటీముట్ట‌న‌ట్టుగానే ఉన్నా ఒక్క విష‌యంలో మాత్రం వీరు ఇన్‌డైరెక్టుగా ఒక్క‌ట‌వుతున్నారు.కొండా దంప‌తుల‌కు చెక్ పెట్టేందుకు వీరు ఎవ‌రికి వారు పావులు క‌దుపుతున్నారు.

జిల్లాలో ముగ్గురికీ మంచి పట్టుంది.ప్రజల్లోనూ ఆదరణ ఉంది.

ఎవరినీ కాదనలేని పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్‌ది.దీంతో కేసీఆర్ వీరి వ్య‌వ‌హారాల్లో డైరెక్టుగా జోక్యం చేసుకోవ‌డం లేదు

ప్రస్తుతం కొండామురళి సతీమణి సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే తూర్పు నియోజకవర్గంలో తన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు టిక్కెట్ ఇప్పించాలని ఎర్రబెల్లి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.తన అనుచరులు వద్ద కూడా ఇదే చెబుతున్నారు.

ఎర్ర‌బెల్లి చేస్తోన్న ప్ర‌య‌త్నాలు కొండా ముర‌ళీకి తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తూర్పు నుంచి త‌న త‌మ్ముడికి టిక్కెట్టు ఇప్పించి సురేఖ‌ను ప‌ర‌కాల‌కు పంపేయాల‌ని ఎర్ర‌బెల్లి ట్రై చేస్తున్నార‌ట‌.

ఈ విష‌యంలో కేసీఆర్ సైతం రేపో మాపో ఎర్ర‌బెల్లికే ఓటేస్తార‌ని తెలుస్తోంది.ఇక కొండా దంప‌తుల‌తో ఉన్న విబేధాల వ‌ల్ల తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌ని క‌డియం సైతం వాళ్లకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏ అవ‌కాశం కోసం అయినా ఎదురు చూస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌న్ని టీఆర్ఎస్ నుంచి కొండా దంప‌తుల‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.అందుకే వారి చూపులు కాంగ్రెస్ వైపు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube