శ్రీనువైట్ల గొడవపై వాఖ్యానించిన కోనవెంకట్

స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల, రచయిత కోన వెంకట్ ల మధ్య గొడవ ఇప్పట్లో తెరపడేలా లేదు.ఆగడు ప్రారంభానికి ముందు విడిపోయిన ఈ జోడి, రామ్ చరణ్ బలవంతం మీద బ్రూస్ లీ కోసం మళ్ళి కలిసింది.

 Kona Venkat Speaks On Rift With Srinu Vaitla-TeluguStop.com

కథ తనది కాదని కోన, కథ చెడగొట్టిందే కోన అని వైట్ల ఒకరి మీద ఒకరు దుమ్ము ఎత్తిపోసుకుంటూనే ఉన్నారు.

ఇలాంటి సమయంలో దర్శకుడు వైట్లతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి అని కోన వెంకట్ ని అడిగితే ” ప్రస్తుతం మా ఇద్దరి మధ్య సంబంధాలు కోమాలో ఉన్నాయి, అవి బ్రతికే ఉన్నట్ల, లేక చచ్చిపోయాయా అనేది ఇంకా అర్థం కావట్లేదు.

నేను రాసిన చాలా సీన్లు ఆయన సినిమాలో వాడుకోలేదు.అసలు నా జోడించిన అంశాలు కథలో లేనే లేవు.

అయినా నా పేరు వేసారు.ఓ రకంగా నాకది చెడ్డపేరు బహుశా అవి నచ్చలేదేమో, నేనెలా రాసిన దర్శకుడిదే చివరి నిర్ణయం.

బ్రూస్ లీ కోసం అందరం చాలా కష్టపడ్డాం.దానికి తగ్గట్టే మంచి ఫలితాన్ని ఆశించాము.

కాని మేమొకటి తలిస్తే, మరొకటి జరిగింది.మేము అనుకున్నంతగా జనాలకి సినిమా నచ్చలేదు.

యావరేజ్ గా నిలిచింది బ్రూస్ లీ బాక్సాఫీస్ వద్ద ” అనే సమాధానం దొరికింది.

ఈ తంతు చూస్తుంటే మళ్ళి శ్రీనువైట్ల-కోన వెంకట్ కలిసి పని చేయడం మళ్ళి జన్మలో జరిగే పని కాదేమో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube